Saturday, November 23, 2024

సర్వోత్తమం దానం

పాశ్చాత్య ప్రపంచం చాలా విషయాలకు దినోత్సవాలను ఏర్పరుచుకుంది. మన ధర్మం ఆయా విషయాలను జీవన విధానంలో భాగం చేసింది. అందువల్ల ఆ దినోత్సవాలు ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన అవసరం లేదు. వారి విధానం ప్ర కారం నేడు ‘వరల్డ్‌ గివ్‌ డే’ అంటే స్థూలంగా దానాలు ఇచ్చే, వాటిని గుర్త్తు చేసుకునే రోజు. అయితే ఈ సందర్భంగా మనం మన సంస్కృతిలో దానాలకున్న ప్రాధాన్యతను తెలుసుకుందాం.
భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ ధర్మాలలో దానానికి చాలా గొప్పతనం ఉంది. తపస్సు, జపము, ఇతర అనుష్ఠానాలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒక్క ఈ దానం చేయడం వల్ల వస్తుందని పెద్దల ఉవాచ. అంతటి సత్కర్మల కన్నా దానము విశిష్టమని శాస్త్రాలలో ఉంది. దానధర్మ ములే మోక్ష సాధనాలని ఉపనిషత్తులు ఉపదేశిస్తు న్నాయి. ఉపనిషత్తుల ప్రకారము, దానము చేయుట వలన మనిషిలో ఉండే లోభతమనే దుర్గుణం నశించి పోతుంది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, దాపరయుగంలో దానం, కలియుగం లోధ్యానం యుగధర్మాలుగా పేర్కొన్నారు. అయితే దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమేననేది స్పష్టం.
. కర్ణుడు అధర్మ పక్షపాతిగా ఉన్నా, తన శరీరంలో అంతర్భాంగా ఉన్న సహజ కవచ కుండలాలను ఇస్తే చావు తప్పదని తెలిసి, ఇంద్రుడు కొరిదే తడవుగా అర్పించినదున దానకర్ణుడుగా ప్రసిద్ధుడైనాడు. శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన వారు మానవమాత్రులు కాదని గ్రహించి, తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు. వచ్చింది మహా విష్ణవు అని తెలిసీ మూడడుగుల నేల దానం ఇవడంవల్ల నాశనమవుతావని గురువు శుక్రాచార్యుడు చెప్పినా వినని సత్యసంధుడు బలిచక్రవర్తి. దానగుణం సరకాలాలకూ ఆదర్శం. భూమికి పరతాలు, సముద్రాలు భారం కాదు. దానగుణం లేనివారే భారమవుతున్నారు అని పేర్కొన్నాడు శ్రీనాథుడు. దానాలలో రకాలు దానమనేది నిత్యకర్మ కావచ్చు, లేదా నైమిత్తిక దానమో, కామ్యక దానమో, విమల దానమో కావచ్చు. అంటే ఆకలి గొన్నవారికి ఆహారమును ఇవడాన్ని అన్నదానము అంటారు.
నిత్యదానం
ప్రతిరోజూ చేసే అన్నదానాన్ని నిత్యాన్న దానము అంటారు. ఈ నిత్యాన్న దానాన్ని అనేక దేవస్థానాలలోను, ధార్మిక సంస్థల లోనూ చూస్తూనే ఉంటాము. ఇలాంటి అన్నదానాలకు తమ వంతు సహాయాన్ని తప్పకుండా అందించాలి. అలాగే ఇలాంటి అన్నదానాలకు తయారు చేయించే పదా ర్థాలను తయారు చేయించే వారు, తయా రు చేసేవారు కూడా ఆ పదా ర్థాలను భగ వంతుడికి సమర్పించే పవిత్ర నైవేద్యాలు అనే పరమ పవిత్రమైన భక్తి భావనతో అంతే పవిత్రంగా తయారు చేస్తే పుణ్యం లభిస్తుంది. దానం అనే పవిత్ర కార్యాన్ని మొక్కుబడిగా చేయడం కూడా పాపమే.
నైమిత్తిక దానం
నైమిత్తిక దానమంటే ప్రత్యేక దినాలలో చేసే దానాలు. గ్రహణాలు, సంక్రమణాల వంటి రోజుల్లో చేసేవి. చాలా మంది తమ పుట్టినరోజు నాడో, పెళ్ళిరోజు నాడో, ఇతర ప్రత్యేకమైన దినాలలోనో చేస్తుంటారు. ఉగ్రరథ, భీమరథ శాంతులలో భాగంగా కూడా ఈ దానాలు చేస్తారు. ఎవరైనా మరణిస్తే, వారి కర్మలు అయ్యాక, పదవ రోజున దశ దానాలు చేస్తారు. ఇవన్నీ నైమిత్తికమైన దానాలు అనబడతాయి.
కామ్యక దానం
కామ్యక దానాలంటే, ఏదైనా తమ కోరిక తీరడం కోసమో, లేక తనవారి, ఊరి వారందరి క్షేమం కోసమో చేసే పూజలు లేదా యజ్ఞ యాగాదులలో భాగంగా చేసే దానాలు. కామ్యక దానాలం టారు. అందులో బంగారము, వెండి గోవులను దానంగా ఇస్తారు.
విమల దానం
యతులు, గురువులు, సన్యాసులకు ఇచ్చే దానములు విమల దానములు. దాతకు ఏ కోరికా, అవసరమూ ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు. వీటిని భయంతో కాకుండా కేవలము భక్తితోనో, దైవ చింతతోనో చెయ్యాలి. ఈ దానాలు అన్నీ కూడా, మూడో కంటికి తెలియకుండా, తమ గొప్పకోసమో, ఇతరుల మెప్పు కోసమో కాకుండా చేసినపుడే, ఫలితాలు ఉంటాయి.
ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నవి రెండు రకాలు. ప్రతిష్టాత్మక దానాలు, ప్రేరక దానాలు. ఎదుటి వారు ఎంత ఇచ్చారు అని తెలుసుకొని, తన పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టలు పెంచుకోవడం, తదారా ప్రచారం కోసం వారు ఇచ్చిన దానికంటే తాను ఎక్కువ దానం చేయడాన్నే ప్రతిష్టాత్మక దానం అంటారు. నేను దానం చేస్తున్నాను, నేను చేసే ఈ దానం పదిమందికి తెలిసే విధంగా బోర్డులు పెట్టించండి. ప్రచారం చేయండి. అది చూసి ఇతరులు కూడా దానం చేస్తారు అని అంటూ దానం చేసేవారి దానాన్ని ప్రేరక దానాలు అంటారు. నియమాలు నిజానికి పూరం దాన ధర్మాలు ఆచరించడానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పరిచారు. దానము చేసే దాత, తనకు ఏ విధమైన నివారింపలేని రోగాలు లేనప్పుడు, పాప సంచితుడు కానపుడు, పాతకాలు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు, ధనాన్ని నీతి, న్యాయ, ధర్మ మార్గములలో సంపాదించి నప్పుడు మాత్రమే దానము చేయుటకు అర్హుడు. దానము మీద శ్రద్ధ, భక్తి కలిగి ఉండటము, దానమనేది పుణ్య కార్యము అనే ఉద్దేశము కలిగి ఉండి దానం చేయుట ముఖ్యం.
అంతే కాదు, గ్ర#హత కూడా ఆ దానమును సీకరించుటకు అర్హుడై ఉండాలి. గ్ర#హత చెడు అలవాట్లు, చెడు శీలము కలిగినవాడు కారాదు. అయితే తాము ఇచ్చే వస్తువులు, పదార్థములు ఉపయోగ యోగ్యములుగా ఉండాలి. పాచిపోయిన, నిరుపయోగ వస్తువులు, పాడైపోయిన పదార్థాలు, పాలివక వట్టిపోయిన ఆవులు, ఇతర లోహములను కలిపిన మిశ్రమ బంగారము వంటివి దానంగా ఇవరాదు. తనకు చెందని వస్తువులు పదార్థములను ఎన్నటికీ దానము చేయరాదు, తాము సీకరించేవి అటువంటివే అని తెలిస్తే, తీసుకొనే వారు కూడా వాటిని తీసుకోరాదు. ఇవి రెండూ పాపమే.
దాత, గ్రహిత కూడా, అక్రమ మార్గాల దారా సంపాదించిన ధనమును దానం చేయరాదు. అట్టి వాటిని ఇవరాదు, తీసుకొనరాదు. అలాచేస్తే జీవితంలో విపరీత పరిణామాలు కలుగుతాయి. ఒక గృహస్థు, తన శక్తికి మించిన దానాలు ఎన్నటికీ చేయరాదు. గురువులు పుణ్యము వస్తుందని చెప్పారు కదా అని అప్పులు చేసి దానములు ఇవరాదు. తాను ఇచ్చే దానము వలన తన కుటుంబ సభ్యులు కష్టాలను, నష్టాలను అనుభవించరాదు. సాధారణంగా, గృ#హస్తులు తమ ఆదాయములో కనీసము పది శాతము వరకూ దానంగా ఇవవచ్చు. అంటే కనీసము పదిశాతం మాత్రమే అనికాదు. తమ స్తోమతను బట్టి కూడా దానం చెయ్యవచ్చు. ఎదుటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి.
ఇతరుల నుండీ అరువు తెచ్చుకున్నవీ, ఇతరులు తమవద్ద రక్షణ కోసం ఉంచినవీ దానాలు ఇవరాదు. ఇక గ్రహితలు కూడా, సధర్మానికి సంబంధించని వాటిని దానాలుగా సీకరించ రాదు. దానం ఇస్తానని వాగ్దానం చేసి ఇవక పోవడం, ఒకసారి దానము ఇచ్చిన తరువాత దాని గురించి ప్రశ్నించడం లేదా తిరిగి వెనుక కు తీసుకోవడం వల్ల పాపానికి లోనౌతారు. దానము ఇస్తానని మా ట ఇచ్చిఉంటే, ఆమాట తిరిగి తీసుకోరాదు. తప్పకుండా దానము ఇచ్చే తీరాలి. సాకులు చెప్పి తిప్పుకొని తిరగడం కూడా పాపమే.
దానములు అన్నిటిలోకి గోదానము, సువర్ణ దానము, తులాపురుష దానములు గొప్పవిగా చెపుతారు. కానీ వాటికన్నా జ్ఞానదానము, విద్యాదానము, ధర్మమునకు సంబంధించిన విషయ దానము చేయడం అతిగొప్పవని శాస్త్రాలు చెబుతున్నాయి.

రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494

Advertisement

తాజా వార్తలు

Advertisement