శీలము అనగా ప్రవర్తన. సత్ స్వభావము. మంచి నడవడిక. మానవ జీవనరీతు లలో ప్రధానంగా పేర్కొనబడినది శీలము. అదియే సత్ ప్రవర్తన. ఒడిదుడుకులు లేకుండా మానవుడు తన జీవిత పయనమును మంచి నడవడికతో కొనసాగించుటయే ధర్మము. దైవ స్వభావము అని భర్తృహరి తన నీతి శతకం ద్వారా చక్కని సందేశమందించినాడు. శీలము మంచి ఆచారమని ఒక శ్లోకంలో యిలా తెలిపారు.
శ్లో|| వహ్నిస్తస్య జలాయతే జలనిధి: కుల్యాయతే,
తత్రణా
న్మేరు: స్వల్ప శిలాయతే- మృగపతి: సద్య:
కురంగీయతే,
వ్యాలో మాల్య గుణాయతే- విషరస: పీయూష
వర్షాయతే
యస్యాంగే- ఖిల లోక వల్లభ తమం- శీలం సమున్నీతి||
అంటూ ఎవరి శరీరమందు సమస్త జనులకు ను మిక్కిలి యిష్టమైన మంచి ఆచారము అనగా మంచి నడవడి ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి వారికి అగ్ని కూడా జలము వలె చల్లగా ఉంటుంది. సముద్రము కూడా చిన్న కాలువలా అయిపో తుం ది. ఆ క్షణమందే మేరు పర్వతము కూడా చిన్న రాయివలె కన్పడుతుంది. భయంకరమైన సింహ క్రూర జంతువైనప్పటికినీ లేడీ వలె అవుతుంది. భయం గొలిపే త్రాచుపామైనను పూలదండ దారమువలె అగును. ప్రాణములను హరించే విష రూపమయిన ద్రవమయిననూ, అమృతం పూ వాన వలె కన్పడుతూ ఉంటుంది. అనగా అసలు భావము జీవులకు దు:ఖమును కల్గించునవి అన్నియును శీలవంతుని పాలిటికి సుఖప్రదములే అగును ఇదియే శీలము వలన గల్గు పరమ లాభ మని భావము. అనగా శీలవంతులకు బాధకము లు కూడా సాధకములగునని కవి చక్కని సందే శాన్ని అందించుట కలి మానవుల అదృష్టము.
మరొక ఉపదేశం చేస్తూ ఎత్తయిన పర్వత శిఖరము నుండి కఠినమైన రాతి మీద పడి దేహము త్యజయించుటయు, భయంకరములగు విష వాయువులను గ్రక్కుచున్న ఆది శేషుని నోటి యందు, చేతిని పెట్టుటయు, అగ్నిలో దుముకుట యు ఇవి ఒక పక్షమున మేలనవచ్చును గాని, సత్స్వభావమును ఎన్నడూ విడుచుట మాత్రం మేలుగా దనినొక్కి వక్కాణించినాడు కవి.
శీలవంతులకెప్పుడున సంతాపము కలుగ దని వివరిస్తూ ఇలా తెలిపాడు.
శ్లో|| ఛిన్నో- పిరోహతి- తరు:క్షీణో-
ప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృ శన్తస్సన్త: – సంతప్యంతే న విప్లుతాలోకే||
అంటూ చెట్టునఱక బడిన దయ్యును, మరల చిగిర్చి ఎదుగుతూ ఉంటుంది. చంద్రుడు సన్నగిల్లి న తిరిగి పెరుగును అని విమర్శించదు, పెద్దలు అన గా శీలవంతులు లోకమందు కష్టము నొందిన వారై సంతాపము నొందరు. వృక్షాదులవలె తాము మర లనొకప్పుడభివృద్ధికి రావచ్చునని అనుకుంటారు. శీలమే సమస్తమునకు భూషణం అన్నాడు భర్తృ హరి. దొరతనానికి మంచితనం అలంకారం. పరా క్రమానికి మాట నియతి అనగా అసంబద్ధత ప్రలా పములాడకుండుట విభూషణము. తెలివికి ఒక ఉపశమనం అనగా శాంతి భూషణము. శాస్త్రము నకు అణకువ, ద్రవ్యమును ఖర్చు చేయుటలో అనగా దానం చేయుటలో పాత్రత. తపము చేయు వారికి కోపము లేకుండుట, సమర్ధునకు ఓర్పు- నేర్పులు, ధర్మమునకు ఆడంబరము లేక పోవుట విభూషణంగా పరిగణించాలి. అన్నిటికీ మూలమై న మంచి నడవడి, ఉత్కృష్టమైన అలం కారముగా విరాజిల్లుతుంది కావున అన్ని విధము లా శీలమునే ఆశ్రయింపవలయును.
అంటూ భర్తృహరి తన నీతి శతకం ద్వారా సన్మార్గమును, సచ్ఛీలమును సత్ప్రవర్తనను సకల జనులూ అలవరించుకుని సుఖ శాంతులు పొంద వలెనని ఆకాంక్షించాడు.
సచ్ఛీలము కూడ దైన దైవ దత్తమే అన్నాడు. దైవ కృపతో, ఆధ్యాత్మిక ఉన్నతితో సచ్ఛీలురు కావా లన్న తపన కవిలో నిండిపోయి తన భావనలను ఒక్కొక్కటిగా లోకానికి అందించి సఫలీకృతుడ య్యాడు. మంచి ఎవ్వరు చెప్పినా విని, ఆచరణలో చూపించి శీలవంతుల జాబితాలో చేరి తరించి ధన్యులు కావాలి. సంపాదించిన, భగవద్దత్తమైన శీలమును ఎవ్వరూ చెరుపు కొనరాదు. అలా చెరు పుకొనుట కంటే మరణమే మేలని కవి సాభిప్రా యం. ఈ విషయంలో లోకమంతా హర్షించవలసి నదేగాని అన్యధా భావించరాదు. శీలవంతుడే ధైర్యవంతుడు. క్షమాశీలి. సుజనశీలి. పరోపకార పారీణత కలిగి నడుచుకొనువాడు. శీలసంపద సర్వగుణ భూషణంగా తెలిసిమసలాలి. ఇదే కలి మాన వుల కర్తవ్యము. నిత్యము సత్యము. ధర్మ పథము.
– పివి సీతారామ మూర్తి
9490386015