Saturday, November 23, 2024

సమానత్వమే హిందూ ధర్మం

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: హిందూ పురాణాలు సమా నత్వాన్ని నేర్పాయన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవ త్‌జీ. వేల ఏళ్ల నుంచే హిందూ సంస్కృతిలో సమానత్వం ఉం దన్నారు. అందరినీ సమానంగా చూడటమేకాదు ఆత్మబం ధువుల్లా చూడటమే హిందూ సంప్రదాయమన్నారు. వెయ్యేళ్ల నుంచి ఎన్నో దండయాత్రలను ఎదుర్కొన్న చరిత్ర హిందూమతానిదన్నారు మోహన్‌ భగవత్‌జీ. సనాతన ధర్మం ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందన్నారు. మనం వసుధైక కుటుంబం అని అనుకుంటున్నాం కానీ అంతటా అలా లేదని, హిందూ మతాన్ని దెబ్బతీయాలనుకు న్నవాళ్లే దెబ్బతిన్నారన్నారు. రామానుజాచా ర్యుల విశాల విగ్ర#హం సమతా స్ఫూర్తిని చాటి చెబుతుందన్నారు. రామానుజాచా ర్యుల భారీ విగ్రహాన్ని సరైన సమయం లో స్థాపించి భాగ్యనగరం పేరును సార్థ కత వచ్చిందని కొనియాడారు. బుధవా రం సమతామూర్తిని సందర్శించి శ్రీమ న్నారాయ క్రతువులో పాలుపంచుకున్న భగవత్‌, ధర్మాచార్యుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్యర్యంలో ధర్మాచార్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నేత భయ్యాజీ జోషి, మధ్యప్ర దేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 385 మంది సాధుసంతులు, పీఠాధి పతులు, ఆచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవత్‌ మాట్లాడారు. ఇక భగవద్రామానుజుల 216 అడుగుల ప్రతి మ సమానత్వానికి ప్రతీక అన్నారు మధ్యప్రదేశ్‌ ముఖ్య మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌. సమతామూర్తి కేంద్రం అం దరికీ ప్రేరణ ఇస్తుందన్నారు. అందరూ లక్ష్మీనారాయణ సం తానమేనన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. కులాల పేరుతో హిందూ సమాజం చీలిపోవద్దన్నారు. కుల విభేదాలు సమసిపో వాలన్నారు. మానవుల్లో ఉన్న అసమానతలు అనే వైరస్‌ను తొలగించి సమతను పెంపొందించేందుకే సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీ యర్‌ స్వామీజీ. అందుకే శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం
కూడా చేస్తున్నామన్నారు. తమ ఆచారాలను గౌరవిస్తూ ఇత రుల ఆచారాలను కూడా గౌరవించేవారే నిజమైన వైదికుల న్నారు చిన్నజీయర్‌ స్వామీజీ. సాధుసంతులు, పీఠాధిప తులు, ఆచార్యులంతా ఒక్కతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైం దన్నారు అయోధ్య ట్రస్ట్‌కు చెందిన గోవింద దేవగిరి మహరాజ్‌. సమతామూర్తి విగ్రహ స్థాపనకు కృషిచేసిన మైహూంగ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు చరిత్రలో నిలిచిపోతారన్నారు.ఇవాళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసా దరావు సమతామూర్తిని దర్శించుకున్నారు.
దివ్యదేశాల సందర్శన
శ్రీరామనగరంలోని 216 అడుగుల భగవద్రా మానుజుల విగ్రహాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌తోపాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమం త్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దర్శించుకు న్నారు. 108 దివ్యదేశాలను సందర్శించా రు. ఆలయాల విశేషాలను మోహన్‌ భగవత్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు వివరి ంచారు చినజీయర్‌ వివరించారు. అనం తరం సమతామూర్తి ప్రాంగణం ముందు భగద్రామానుజుల జీవిత చరిత్ర త్రీ డీ షోను వీక్షించారు.
సాయంత్రం యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం లో పాల్గొన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌జీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దంపతు లు. ప్రధాన యాగమండపంలో కంకణం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌జీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను చినజీయర్‌ సత్కరించి, మంగళాశాసనాలు అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

నేడు రాజ్‌నాథ్‌ రాక
భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహ కార్యక్ర మంలో పాల్గొ నేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నా థ్‌ సింగ్‌ గురువారం భాగ్యనగరానికి రానున్నారు. శ్రీరామనగరం చేరుకుని రామానుజుల విగ్రహాన్ని, దివ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనంతరం శ్రీమన్నారాయణ క్రతువులో పాలుపంచు కుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement