Saturday, November 23, 2024

సమాజ శ్రేయస్సు కోసమే చాతుర్మాస దీక్ష

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సమాజ శ్రేయస్సు కోసమే చాతుర్మాస్య దీక్ష చేపట్టానని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రిషికేశ్‌ వద్ద గంగాతీరంలో చేపట్టిన దీక్ష దిగ్విజయంగా పూర్తయింద న్నారు. సోమవారం దీక్ష ముగించుకుని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి విశాఖకు చేరుకున్నారు. స్వామీజీకి పీఠం భక్తులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్షను తపస్సుగా భావించినట్లు- చెప్పారు. నిత్యం గంగా స్నానమాచరించి, రాజశ్యామల అమ్మవారి అనుష్టానం మధ్య దీక్ష చేసామన్నారు. ఆదిశంకరాచార్యుల భాష్య విచారణ చేసామని చెప్పారు. గంగాతీరంలో ఏటా తపస్సు చేసే ఏ-కై-క పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం అని వివరించారు. గంగమ్మ దీవెనలు అందుకుని విశాఖకు తిరిగి వచ్చానని చెప్పారు. ఎయిర్‌ పోర్టు నుంచి విశాఖ శ్రీ శారదా పీఠానికి చేరుకున్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి భక్తులు సాంప్రదాయ పూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళతాళాలు, కోలాటం మధ్య ఆహ్వానించా రు. పీఠం ముఖద్వారం వద్ద స్వామీజీ గోపూజ నిర్వహించారు. అనంతరం పీఠం లోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యా మల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాతుర్మాస్య దీక్షను విజయవంతంగా పూర్తి చేసి విశాఖకు తిరిగివచ్చిన స్వామీజీకి మంత్రి ఆవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నెడ్‌ క్యాప్‌ ఛైర్మన్‌ కేకే రాజు, క్షత్రియ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, పెట్రోకారిడార్‌ ఛైర్మన్‌ చొక్కాకుల విజయలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దాడి రత్నాకర్‌, జీవీఎంసీ డిప్యూటీ- మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, కో ఆప్షన్‌ సభ్యులు బెహరా భాస్కర్‌, సింహాచలం ధర్మ కర్తల మండలి సభ్యులు దినేష్‌ రాజ్‌, గంట్ల శ్రీనుబాబు, భక్తకోటి ప్రతినిధి బొగ్గు శ్రీను తదితరులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement