సీతాదేవిని వెతకడానికి నలుదిక్కులకూ ఒక్కొక్క వానర నాయకుడి నేతృత్వంలో కోటానుకోట్ల వానర వీరుల ను పంపించే ముందర వాళ్ళు వెళ్లే దిక్కులోవున్న ప్రదే శాలను వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆయన మాటల్లో అది సమస్త భూమండలమే!
సీతను వెతకడానికి ముందుగా తూర్పు దిశకు వినతుడిని వెళ్ళమన్నాడు. ఆ దిక్కున వున్న ప్రదేశాలను వివరించాడు. సర యూ నది, గంగ, కౌశికిన, మనో#హరమైన సింధు, యమున, సర స్వతి వున్నాయి. కొండలతో, వనాలతో కూడిన మ#హనది, కాల మ#హ, బ్ర#హ్మమాల, విదే#హం, మాలవం, కాశికాపురం, మగధ దేశ గ్రామాలు, కోసలం వున్నాయి. సముద్ర మధ్యన ఏడు ఖండా లతో కూడిన యవద్వీపం, స్వర్ణ రూప్యకమనే దీవు లను దాటిపోతే పెద్ద శిఖరం కల శిశిరం అనే పర్వతం వుంటుంది. దానితర్వాత ఎర్ర టి నీళ్లు, లోతు, మహా వేగంకల శోణ నాదం వుంటుంది.
ఎర్రటి నీళ్లున్న సురా సముద్రాన్ని చూసుకుంటూ పోతే, బం గారం, మణులతో ప్రకాశిస్తూ కైలాసంతో సమానమైన, విశ్వకర్మ నిర్మించిన గరుత్మంతుడి గృహాన్ని చూడవచ్చు. అక్కడ తెల్లటి మేఘంలాగా పాల సముద్రం వుంది. నిర్మలమైన పాల సముద్రం మధ్యలో ప్రసిద్ధమైన ఋషభ పర్వతం వుంది. అది తెల్లటి కాంతి కలదై, దివ్యమైన పరిమళాలతో, పూలతో కూడిన బంగారి చాయ కల చెట్లతో నిండి వుంటుంది. అక్కడే బడలిక పోయే సుందరమైన కొలను వుంటుంది. దానిపేరు సుదర్శనం. ఆ కొలనులో తెల్లటి కిం జల్కాలు కల తెల్ల కమలాలు వుంటాయి. వాటి కోసం కిన్నరులు, చారణులు, దేవతలు, వారి సమూహాలు, అప్సరసలు, జలకేళి కొరకు వస్తుంటారు. ఆ పాల సముద్రాన్ని దాటిపోతే, ప్రాణికోటికి భయం కలిగించే, ¸°ర్య మ#హర్షి కోపం మూలాన పుట్టిన గుర్రపు ఆకారం కల అగ్ని కనబడుతుంది. ఆ శుద్ధోదక సముద్రాన్ని దాటి అటువైపు పోగా అక్కడ పదమూడు యోజనాలు కల బంగారు రాయికల బంగారు కొండ, అటుపిమ్మట బంగారు మయమైన తూర్పుకొండ వుంది. ఆ పర్వత సమూ#హంలో ఆకాశాన్ని తాకు తూ, బంగారు మయమై, నూరామడల విస్తీర్ణం కల అందమైన అరుగు వుంది. అక్కడ మద్ది చెట్లు, తాటి చెట్లు, చీకటి మాకులు, కొండ గోగులు, సూర్యకాంతితో పూచి వుంటాయి. అక్కడ యోజ నం వెడల్పున, పది ఆమడ ఎత్తున పర్వత శిఖరం వుంది. దాని పేరు సౌమనసం. సూర్యుడు జంబూద్వీపం ఉత్తరభాగంలో తిరు గుతూ ఆ కొండమీదకు వచ్చినప్పుడు మేరువు దక్షిణ దిక్కువారికి కన పడుతుంది. దానిపక్కదే సుదర్శనం. ఈ ద్వీపంలో సమస్త ప్రాణి సమూహాలకు నేత్ర కాంతి కలిగించే తేజంతో సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. బ్ర#హ్మ దేవుడు భూలోకానికి, తక్కిన లోకా
లకు, ద్వారంగా చేసిన కారణాన, సూర్యుడు సంచరించడానికి మొదలు అక్కడి నుండే బయల్దేరడం వల్లా, దాన్ని పూర్వదిశ అంటున్నారు. ఆ తూర్పుకొండకు ఆవల దేవతలు వుంటారు. అక్కడ చంద్రసూర్యకాంతులు లేవు. చీకట్లు వ్యాపించి వుంటాయి. అక్కడి దాకా పోవచ్చును కాని ఆ తరువాత వెళ్ళడం సాధ్యపడదు. దక్షిణదిక్కుకు నీలుడిని, #హనుమంతుడు, జాంబవంతు, అంగ దుడు తదితరులను వెళ్ళమన్నాడు. వీళ్లందరికీ దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి చెప్పాడు. అనేక వృక్షాలు, లత లు, వేయి శిఖరాల పర్వత శ్రేష్టం వింధ ము, పెద్దపెద్ద పాములు కల నర్మద, విశాలమైన గౌతమీ అనే పేరున్న నదీ తీరం, కృష్ణ, మహా నది, వరద, మేఖల ఉత్కలం, దశార్ణము, ఆశ్వవంతి, అవంతి, విదర్భ, మ#హషి ఋషికాలు, వంగా, కాశీ, కళింగ, అంగ దేశాలుం టాయి. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, దేశాలు, స#హ్య పర్వ తం వుంటాయి. కావేరి, తామ్రపర్నీ నది వుంది. దానికి అవతల బం గారు రేకులతో ప్రకాశించే పాండ్య నగరి వుంది. సముద్రం లోపల, అగస్త్యుడు పూర్వం మ##హంద్ర పర్వతం నిలిపాడు. అది నీళ్లల్లో మునిగీమునగనట్లు కనిపిస్తుంది. సముద్రం మధ్యలో నూరా మడల విస్తారం కల ద్వీపం వుంది. అదే రావణుడు వుండే పట్టణం.
దక్షిణ సముద్రం మధ్యలో అంగారక అనే రాక్షసి వుంది. అది ఆకాశాన పోయే వారి నీడను పట్టుకుని నిలిపి బక్షిస్తుంది. ఆ ద్వీపం నుండి నూరా మడ పోతే, అక్కడ సిద్ధులు, చారణులు వుండే, సూర్యచంద్ర కిరణాలతో సమానమై, సముద్ర జలాలతో చుట్టబడ్డ, ఆకాశాన్ని తాకే శిఖరం కలిగిన పుష్పితకం అనే పర్వతం కనిపిస్తు ంది. దాని బంగారు శిఖరాన్ని రాసుకుంటూ సూర్యుడు దక్షిణా యనంలో దాని వెండి శిఖరానికి వస్తాడు. దక్షిణాయనంలో దీనికి దక్షిణంగా సూర్యుడు పోడు. ఆ పర్వతాన్ని దాటి పధ్నాలుగు ఆమడలు పోతే వైద్యుతమైన సూర్యవంతం అనే కొండ వస్తుంది. ఆ కొండలోనే విశ్వకర్మ అగస్త్యుడికి బంగారంలాగా ప్రకాశించే ఆమడ వెడల్పు, పదిఆమడ ఎత్తుకల, దివ్య రత్నాలతో విలసిల్లే ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆ మహా పర్వతంలో సర్పాలతో రక్షించ బడే భోగవతి అనే పేరు కల సర్పరాజైన వాసుకు నివాసం వుంది. ఆ పాముల నగరంలోపల అక్కడక్కడా ర#హస్యస్థలాలు వున్నా యి. అవన్నీ దాటితే వృషభాకారం కలిగి, దేవతా సంబంధమై, అగ్నికాంతితో, గోరోచన కాంతితో వెలిగే ఋషభం అనే పర్వతం వుంటుంది. అది భూమికి పొలిమేర. అంటే ఆవల సముద్రం వుం
దని అనుకోవాలి. దాన్నీదాటితే భయానకమైన యమలోకం వుంటుంది. కాబట్టి మనుష్యులకు పోవడం సాధ్యం కాదు.
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, పశ్చిమంగా వెళ్ళ మన్నాడు. పశ్చిమ దిశగా సురాష్ట్రం (ఇప్పటి సూరత్), బా#్లహకం, శూరము, భీమమనే దేశాలు విశాలంగా వుంటాయి. పడమటగా ప్రవ#హంచే నదులు, మునులుండే అడవులు, కొండలు, నీరులేని ప్రదేశాలు, దేశాలను దాటిపోతే పశ్చిమ సముద్రం వస్తుంది. అది దాటిపోయి మురచీ పట్టణం, జతీపురం, అవంతిని, అంగలోప వుంటాయి. అక్కడినుండి సింధునది సముద్రంలో పడేచోటు వస్తుంది. అక్కడ దక్షిణ లోయల వెంట వుండే #హల పర్వతాన్ని చూడవచ్చు. అక్కడ పెద్ద మ్రాకులు, అనేక శిఖరాలు కలిగి ఆకాశా న్ని అంటే, రెక్కలుకల దానిలాగా ఎగిరే సింహాలుండే చరియలు కల ##హమగిరి వుంది. ఆ పర్వతం దాటి నూరామడలు పోతే, చూడ డానికే అసాధ్యమైన పారియాత్ర పర్వత శిఖరాన్ని చూడవచ్చు. గంధర్వులు వుంటారక్కడ. వీరి దేశం గాంధార దేశం.
అక్కడ పవిత్రమైన దృఢమైన వజ్రధరం కొండ వుంది. అం దులో చిత్రమైన నూరామడల చదరమైన నేల వుంది. దానికి ఆవల సముద్రంలోని నాల్గవ భాగంలో చక్రవంతం అనే పెద్ద పర్వతం వుంటుంది. అక్కడ విశ్వకర్మ రచించిన సా#హస్రార చక్రం వుంది. దాన్ని రక్షించే #హయగ్రీవుడిని, పంచజనుడిని చంపి, విష్ణువు #హయ గ్రీవుడి చక్రాన్ని, పంచ జనుడి వెన్నెముక అయిన శంఖాన్ని తీసుకున్నాడు. పంచజనుడి వల్ల లభ్యమయింది కాబట్టే శంఖానికి పాంచజన్యమని పేరువచ్చింది. ఆ తరువాత అరవై ఆమడలు పోతే సముద్రంలో వెండిశిఖరంతో కూడిన వరా#హ పర్వతం వుంటుం ది. విశాలమైన ఆ పర్వతంలో ప్రాగ్జ్యోతిషం (దీని ఇప్పటి పేరు అస్సాం) అనే పట్టణంవుంది. ఇవన్నీ చూస్తూ పోతుంటే సెలయేళ్లు న్న సర్వసౌవర్ణం అనే పేరున్న కొండ వస్తుంది. ఆ పర్వ తానికి మేఘవంతం అనే పేరు. అది దాటిపోతే అరవై వేల కొండలు వస్తాయి. ఆ పర్వతాల మధ్య ప్రదేశంలో ఉత్తర మేరు సావర్ణి అనే పర్వతం వుంది. విశ్వులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు మొదలైన దేవతలు సాయంకాలం బంగారు కొండమీద వున్న సూర్యుడిని సేవించడానికి వస్తారు. గడియకు పదివేల ఆమడల వంతునపో యి సూర్యుడు పడమటి కొండకు చేరుకుంటాడు. ఆ పర్వత శిఖరం కొనలో సూర్యకాంతికల మేడలతో నిండిన ఒక ఇల్లువుంది. అది విశ్వకర్మ నిర్మితం. అక్కడ అస్తపర్వతానికి, మేరు పర్వతానికి మధ్యన బంగారు మయమై, చిత్రమైన అరుగు కలిగి, పది తలల తాలవృక్షం కనపడుతుంది.
ఆ తరువాత సుగ్రీవుడు శతవలిని ఉత్తర దిక్కుకు వెళ్ళమం టాడు. ఉత్తరాన #హమవత్పర్వతం వుంది. వ్లుెచ్చ దేశంలో శూర సేన, పుళింద, ప్రస్థర, మద్రక, భారత (#హస్తినాపుర), దక్షిణ కురు భూములు, కాంభోజ, యవన, శకదేశం, అరట్ట, బా#్లహక, పౌరవ, టంకణ, ఋషిక దేశాలు, జీనా దేశం, పరమ చీన (మంచూ రియా, మంగోలియా) దేశం వుంటాయి. సోమాశ్రమం, కాలపర్వ తం అవతల వైపున గు#హలుంటాయి. ఆ పర్వతందాటగా సుద ర్శనం అనే పర్వతం వస్తుంది. అది దాటిపోయిన తరువాత దేవ సఖమనే పర్వతంవుంటుంది. దానికి అవతల కొండలు, నదులు, చెట్లు, జీవ జంతువులులేని నూరామడల పొడవున్న దేశం వుంటు ంది. దీన్ని గోబి, శాము ఎడారి అంటారు. ఆ మరుభూమిని దాటి పోతే కైలాస పర్వతం కనబడుతుంది. అక్కడ తెల్లటి మేఘంతో సమానమై, బంగారంతో అలంకృతమై, తెల్లటి కాంతికల కుబేరుడి ఇల్లుంది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఆ ప్రదేశంలో పూర్వం
కుమారస్వామి శక్తి ప్రయోగంతో నిర్మించిన శిబిరం వుంది. ఆదారిలోనే #హంసలు మానస సరస్సుకు పోయి వస్తుంటాయి. ఆ బిలంలోకి పోవడం అంత సులభంకాదు. అక్కడ వృక్షం, కామ శైలం, మానసం అనే పర్వతాలున్నాయి. తరువాత మైనాక పర్వ తం వస్తుంది. ఆ పర్వతం మీద మయుడనే దానవుడి గృ#హం వుం ది. అక్కడ సిద్ధులుండే ప్రదేశంలో వైఖానసం అనే సరస్సు వుంది. ఆ సరస్సుకు ఆవల సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్ర కాంతి లేదు. అక్కడ మేఘాలు లేవు. ఆకాశం శబ్దం లేకుండా వుంటుంది. మీరది దాటిపోతే శైలో దం అనే శిలానది వుంది. దానికి ఇవతల, అవతల కీచకాలు అనే పేరుకల వెదుళ్ల పొదలుంటాయి. ఆ ఏటి నీళ్లలో దిగినవారు రాళ్లు గా మారిపోతారు. కాబట్టి ఆ నది దాటా లంటే, ఆ పొదల వెదుళ్ళు పట్టుకుని పోవాలి, ఆ దరిన, ఈ దరిన వెదుళ్ళు కలిసికొని అల్లుకుని వుంటాయి. ఆ ఉత్తర భూములు పుణ్య పురుషులకు భోగ స్థానాలు.
అక్కడున్న అనేక నదుల్లో వైఢూర్యాలున్న ఆకులతో బంగా రు కమలాలు వున్నాయి. ఎర్రటి కలువల వనాలున్నాయి. జాతి నీలాల కాంతికల రేకులు, అపరంజి బంగారు కాంతికల కింజల్కా లున్న నల్లటి కలువలతో నిండిన సరస్సులు అందంగా వుంటాయి.
ఆ ఉత్తర కురుభూముల్లో కొన్ని పర్వతాలు అసమానమైన పీటలు, మంచ ాలు కాస్తాయి. దాన్ని దాటి ఉత్తరంగా పోతే, సము ద్రంలో సోమశైలం అనే పేరున్న బంగారు మయమైన పర్వతం వుంటుంది. దాన్ని ఇంద్రలోక వాసులు, బ్ర#హ్మలోకవాసులు కాపాడుతుంటారు. ఆ ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా బంగారు కాంతివల్ల వస్తువులు కనబడుతుంటాయి. అక్కడ షాడ్గు ణ్య పరిపూర్తి కలిగి ప్రపంచ స్వరూపుడైన విష్ణువు, ఏకాదశ మూర్తులు ధరించి, మన్మథ విరోధి అయిన శివుడు, ప్రపంచాన్ని సృష్టించిన బ్ర#హ్మకాపురం వుంటారు. ఉత్తర కురుభూములకు ఉత్తరంలోని సోమపర్వతం చేరడం సాధ్యపడదు. ఆవలి దేశం కట్టుపాటులేనిది. సూర్యకాంతి వుండదు. అక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012