Saturday, November 23, 2024

సమర్పణ

మామానవుడి జీవితం అపరా ప్రకృతిలో కొనసాగుతున్నప్పుడు ప్రాథమిక దశలో వ్యక్తిగత సాధన మూడు విధాలుగా ఉంటుంది. అవి ఆకాంక్ష, నిరాకరణ, సమ ర్పణ, ఇప్పటివరకు ఆకాంక్ష, నిరాకరణ గురించి చెప్పుకున్నాము. ఈ రోజు చివరి దైన సమర్పణ గురించి మాట్లాడుకుందాం.
యోగ సాధనలో ప్రథమ ఆవశ్యకత సమర్పణదే. చివరి ఆవశ్యకత కూడా సమర్పణ యే. సాధకుడు విశ్వాసంతో, దృఢ నమ్మకంతో, తనని తాను దైవమునకు అర్పించుకున్న ప్పుడు, స్వభావమును, హృదయమును పరిశుద్ధం చేయడం, ఆంతరిక చేతనను మేలు కొల్పడం, తెరలను తొలగించడం, సమస్తము పరమాత్మనే చేయగలుగుతాడు. క్రమంగా ఆంతరిక సహాయము, మార్గదర్శకత లభించి, దైవానుభవం అంతరంగంలో పెంపొందు తుంది. ఇక ఏ శక్తితో గాని తపస్సుతోగాని అవసరం ఏర్పడదు.
దైవ సంకల్పమునే మన సంకల్పంగా సమ్మతించి, ఆ దివ్యమైన దానిని తిరస్కరించిన ప్పుడు అది సక్రియా సమర్పణ అవుతుంది. సమస్తాన్ని పూర్తిగా పరమాత్మకు వదిలివేసిన ప్పుడు అది నిష్క్రియా సమర్పణ అవుతుంది.
ఆధునిక నిష్క్రియతను యదార్థమైన సమర్పణగా భయపడితే ఇక యదార్థమైనది, శక్తివంతమైన ఏదీ సాధించబడదు. ఎందుకనగా భౌతిక ప్రకృతి యొక్క తామసిక నిష్క్రియ త అజ్ఞానము. అదైవీ ప్రభావం క్రింద ఉంటుంది. కాబట్టి సాధకుడు తన ఉనికిని, తన సర్వస్వ మును, చేతనా భూమికలన్నింటినీ జరిగే ప్రతి కదలికను దైవానికి, అతని శక్తికి సమర్పించుకో వలయును. అప్పుడు మాత్రమే సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు అయిన ఆ పరమాత్మ అతని లోకి దిగి, సాధకుడి అపరా ప్రకృతినంతా, పరా ప్రకృతిగా, దివ్యకాంతితో వెలుగింపజే స్తాడు. ఇక మన కార్యక్రములన్నింటినీ ఆ దేవాది దేవుడే చేపట్టి తనే స్వయంగా చేసి పెట్టును. సమర్పణ అంతరంగం నుంచి జరిగినప్పుడు శ్రీమాతా ప్రవేశం ఏర్పడి, ఆమె శక్తితో దైవకర్మ లను మనం సునాయాసంగా చేయగలము అంటారు శ్రీ అరవిందులు. ఇక శ్రీమాతా సమర్పణ గురించి వివరించిన విషయములను విశ్లేషణ చేద్దాం.
మనిషి ప్రాథమిక దశలో బుద్ధి ద్వారాగానీ, భక్తి ద్వారాగా నీ, తననుతాను దైవానికి సమర్పించుకుంటాడు. దైవము మాత్ర మే సత్య ము అనే దృఢ నమ్మకము ఏర్పడి, పరమాత్మలేని జీవిత ము దుర్భరం అనిపిస్తుంది. ఇక అప్పటినుండి తన జీవిత బాధ్యతను దైవానికి అప్పజెప్పటమే ఏకైక మార్గముగా తోచును. తదుపరి ఆత్మ సమర్పణతో దైవ సేవయే నా పరమార్థము. నా జీవితమంతా దివ్య జీవనా న్ని సిద్ధింపజేసుకొనుటకే అనే భావన ఏర్పడ డం తొలిమెట్టు. అనుక్షణం దైవం గురించే ఆలోచిస్తూ ఉంటే ప్రతి కదలికలో పరమాత్మ చైతన్యమే నా ద్వారా పని చేస్తుంది. ఇక నాది, నీది అనే తేడా లేకుండా సమస్తం తిరిగి దైవమునకే ఇచ్చి వేస్తాము. ఆ స్థాయికి చేరినప్పుడు అల్పమైన కర్మలు లేక ఉన్నతమైన పనులు అనే తారతమ్యత లేకుండా సర్వం దివ్య కార్యముగా భావన చేస్తూ కర్మలను ఆచ రిస్తూ ఉన్నప్పుడు దైవానుభూతి, దైవ సాక్షాత్కారము కలుగును. ఆత్మ నివేదన పరిపూ ర్ణమైనప్పుడు సత్తా అంతయూ పూర్ణాహుతికి సంసిద్ధమగును. ఇక సాధన శిఖర స్థాయికి చేరి మన సమస్యలన్నియూ సమసిపోయి, జీవితము సాఫీగా సాగును. సాధనలో ఉన్నతంగా ఎదిగినప్పుడు పరమ చైతన్యము, దైవ సాన్నిధ్యము లేకుండా సాధకుడు ఏ పనిని చేయ జాలడు. సమస్త అస్తిత్వము, సర్వ అంగములు, సంపూర్ణముగా దైవముతో మమేకము అయినప్పుడు ఇక ఆ భగవంతుడు ఒక క్షణం కూడా ఉండ లేక, ఆయనే ఆధారముగా, ఆయనే ప్రాణంగా ఉంటుంది. దైవము మినహా ఇంకేమి లేదు అని శూన్యముగా అనిపించును. మానవుడు తన జీవితమును దైవమునకు అర్పణ చేసుకోవాలని నిశ్చయిం చుకున్నప్పుడు అనుకోకుండా ఏదైనా దుస్సంఘటన జరిగితే, దైవ మునకు నా జీవితమును అవితము చేసుకుంటే యిలా జరిగిందే మిటి అని చలించిపోయి, వెంటనే ఎదురు తిరుగుతాడు. అలా కాకుండా తన వేదనను సైతం ఆ పరమాత్మ ముందు అర్పించి, ”నీ యిచ్చనే నెరవేరుగాక” నీవు ఏవిధముగా నిర్ణయిస్తే అలాగే జరగ నీ అని విధేయత తో హృదయ పూర్వకముగా చెప్పాలి. ఇక శాంతముగా స్థితప్రజ్ఞ తతో ఉండి, నిజమైన ఆత్మ సమర్పణకై ప్రయత్నించాలి. అన్నింటికంటే ముఖ్యం మనిషి తన ప్రకృతిని, ఉనికిని, స్వభావమును సమర్పించు కోవాలి. అవి అన్నియూ నిమ్మ ప్రకృతి నుండి ఉన్నత ప్రకృతి వైపు మార్పు చెందాలి కాబట్టి మనము సమ ర్పించాల్సిన ముఖ్యమైన వస్తువు మన వ్యక్తిగతమే. జీవితం పట్ల తన దృష్టిని, తను కోరు కునే ప్రయోజనములను, లంపటముల సంపుటిని తప్పనిసరిగా సమర్పించుకోవాలి. మనిషి తను చేసే పనుల కంటే తన వ్యక్తిత్వ మును సమర్పించుకోవటము అత్యంత ప్రాము ఖ్యము. నువ్వు చేసే పనుల కన్నా నీ వ్యక్తిత్వ మే వెయ్యి రెట్లు ముఖ్యమైనది. మార్గం సుదీర్ఘం అయినప్పటికీ ఆత్మ సమర్పణ దానిని దగ్గర దారిగా మారుస్తుంది. మిక్కిలి సమస్యాత్మక మార్గం అయినప్పటికీ, పరిపూర్ణ దృఢ నమ్మకం దానిని సుగమం చేస్తుంది అంటారు దివ్యమాత.
– కవితా శ్రీధర్‌ , 9395511193

Advertisement

తాజా వార్తలు

Advertisement