Tuesday, November 26, 2024

సనాతన వాఙ్మయంలో ధర్మాలు !

అనంతమైన సనాతన వాఙ్మయంలో లేని విషయం ఏదీలేదు. మానవాళి మనుగడ కొరకు ఇహపరములలో పాటించాల్సిన అన్ని సూత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. సమాజ కళ్యాణానికి ప్రతి పౌరుడు అనుసరించాల్సిన ధర్మములు సంపూ ర్ణముగా ఉన్నాయి. ఉత్తమ పౌరులతోనే ఉత్తమ సమా జము ఏర్పడుతుంది. ధర్మాచరణ మొదట కఠినంగా ఉంటుంది. కానీ భవిష్యత్‌లో అది సమాజ శ్రేయస్సును కలిగిస్తుంది. ఎవ్వరి మనసును నొప్పించకుండా ఉండాలి అనేది ప్రథమ కర్తవ్యం. ప్రాణహాని ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. ఇతరులను భయభ్రాంతులను చేయుట హాపాపము. ఏ విషయమునైననూ మధురమైన సంభాషణలోనే చెప్పవలెను. మంచి మాటలు ఆభర ణములుగా కలిగి ఉండాలి. ఎదుటి వారిని అవమాన పరిచి హేళన చేసి గర్వపడుట అత్యంత అవివేకమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. చివరకు అవమానపర చినవాడే నశిస్తాడు.
సుఖం హ్యవమత: శేతే సుఖం చ ప్రతి బుద్ధ్యతే
సుఖం చరతిలోకే స్మిన్నవమంతా వినశ్యతి.
అవమానము పొందినవాడు సుఖముగా నిద్ర పోతాడు. సుఖంగా తిరుగుతాడు. అవమానించిన వాడు మాత్రం చివరకు పాపఫలం అనుభవిస్తాడు. చివరకు నశిస్తాడు. దివ్యాంగులను హేళన చేయడం అజ్ఞానం. దీనులను ఆక్షేపించుట నరకమునకు హేతువు. వార్ద్యక్యము ప్రతి ఒక్కరికి తప్పని అవస్థ అని తెలుసుకోవాలి. వృద్దులను ఆదరించాలి. వారిపట్ల సహనం వహించాలి. అపారమైన వారి అనుభవం నుండి సన్మార్గమును ఏర్పాటు చేసుకోవాలి. జాతిని కాని, వృత్తిని కాని అక్షేపించుట మానవ లక్షణం కాదు. దారిద్య్రంలో ఉన్నవారికి చేతనైతే సహాయం చేయాలి కానీ ఆక్షేపించకూడదు.
ఆచార్యంచ ప్రవక్తారం పితరం మాతరం గురుమ్‌
నహింస్యాత్‌ బ్రాహ్మణాన్‌ గాశ్చ సర్వాంశ్చైవ తపస్విన:
ఉపనయనమును ఇచ్చిన ఆచార్యుని, వేదార్థ ములు చెప్పు విద్వాంసుని, తల్లిదండ్రులను, బ్రహ్మజ్ఞా నులను, తపస్వులను సదా గౌరవించి పూజించాలి. ఎట్టి పరిస్థితులలోను వారి మనస్సులను నొప్పించ కూడదు. గురువు, తల్లి, తండ్రి, అన్న వీరిని ఎప్పుడూ అవమానించకూడదు.
యం మాతా పితరౌక్లేశం సహేతేె సంభవే నృణామ్‌
నతస్య నిష్కృతి శ్శక్యాకర్తుం వర్ష శ తైరపి.
సంతానము అభివృద్ధి కొరకు తల్లిదండ్రులు అనేక క్లేశములు పడతారు. అందువల్ల తల్లిదండ్రుల రుణము తీర్చుకొనుటకు అనేక జన్మలు కూడా సరిపోవు. ఋత్వికుడు, పురోహితుడు, ఆచార్యుడు, మేన మామ, అతిథి, బాలబాలికలు, వృద్ధులు, రోగి, వైద్యుడు, జ్ఞాతి, వియ్యంకుడు, బంధువు, తల్లి దండ్రులు, అక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు, పుత్రుడు, కుమార్తె, భార్య, సేవకుడు. వీరితో కారణమున్ననూ వివాదమునకు దిగకూడదు. సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలి. స్త్రీలు ఎక్కడ పూజింపబడుదురో అక్కడ దేవ తలు నివాసముంటారు. స్త్రీలు ఎక్కడ అవమా నించబడతారో అక్కడ తుదకు సర్వనాశనము తప్పదు. శుభమును కోరు వారు స్త్రీలను గౌర వించాలి. సదా ప్రేమానురాగాలతో పూజించాలి. ఇతరుల సొమ్మును అపహరించుట, శాస్త్రాను మతి లేకుండా హింస చేయడం, పరస్త్రీ సంపర్కము ఈ మూడు మహాపాపములు. ఇవి త్వరితగతిన అశుభ ఫలాన్నిస్తాయి. ఎవ్వరూ నిత్యమూ పరాన్న భోజనమునకు అలవాటుపడుదురో వారు ఆ అన్నదాత ఇంట పశువు గా జన్మించుట తథ్యం. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, సంతానము దీనస్థితిలో వుండగా వారికి ఎటువంటి సహాయం చేయకుండా వారిని వదిలి ఇతరులకు దానము చేయు ఆడంబర కార్యము పూర్తిగా అధర్మము. దానివలన నరకమునకు పోవుట తప్పదు. అయితే స్వజనమునకు భోగములను కూర్చుట సరికాదు. అక్కా చెల్లెండ్రు ఎల్లవేళలా పూజింపదగిన వారు. వారి అగ్రహమునకు గురి అయినచో నాశనము తప్పదు. కానీ వారు సదాశ్రేయస్సునే కోరుచుందురు. ఏ ఇంటిలో భార్య భర్తతోనూ, భర్త, భార్యతోనూ సంతుష్టిని కలిగియుందురో ఆ ఇంట నిత్యమూ శుభ ములు కల్గుట నిశ్చయము. కామము వలన పది దోషములు జనిస్తాయి. అవి వేట, జూదము, పగటి నిద్ర, పరదోష కథనము, పరస్త్రీ సంపర్కము, మద్యపానము, నృత్య, గీత, వాద్య వ్యసనము, వ్యర్థముగా తిరుగుట. ఇచట నృత్య గీత వాద్యములు అతిగా కొన స ాగించిన అది వ్యసనముగా భావింపబడును. క్రోధము వలన ఎనిమిది దోషములు జనిస్తాయి. అవి ఇతరుల మీద నేరములు చెప్పుట, అప్రయోజన సాహసము, కపటముతో అపకారము చేయుట, ఇతరుల సద్గుణములు సహించలేకపోవుట, ఇతరు లలో కేవలం దోషములను చూచుట, ఇతరుల సంపద లను అపహరించుట, పరదూషణము, పరహింస. ఈ పదునెనిమిది దోషములు లేదా వ్యసన ములు త్యజించిన వారు తాము సుఖముగా ఉంటూ సమాజమునకు సుఖమును సుఖమును చేకూర్చిన వారు అవుతారు. మద్యపానము, ఇతర మారక ద్రవ్యాల వ్యసన ము వలన ఎంత నాగరిక సమాజమైననూ అత్యంత హేయముగా నశించుట తప్పదు.
వ్యసనస్య చ మృత్యోశ్చ వ్యసనం కష్టముచ్యతే
వ్యసన్య ధోధో వ్రజతి స్వర్యాత్య వ్యసనీ మృత:
వ్యసనము, మృత్యువు ఈ రెండింటిలో వ్యస నమే బహు చె డ్డది. వ్యసనపరుడూ నరకమును ఇక్కడే అనుభవించి అధోగతి పొందుతాడు. దురభ్యాస ములు లేనివాడు మృతినొంది స్వర్గ గతి పొందుతా డని సనాతన ధర్మము ఎలుగెత్తి చాటుచున్నది. కావున మనమందరము దోష, వ్యసనరహిత సమాజాన్ని కాంక్షిద్దాము.

వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement