Saturday, October 19, 2024

సత్కర్మల ఫలితమే భగవదానుగ్రహం

”మానవులలో అజ్ఞానం, అహంకారం తొలగితే గాని అతడి భక్తి సాఫల్యం కాదు. ఏ పనినైనా ప్రయో జనం లేకపోతే, చేసేపని వ్యర్థమేగా! అలాగే భక్తి ఆచ రణలో కూడా వ్యయప్రయాసలు పడటం అంటే, సరియైన ఫలితం రానప్పుడు అది కూడా వ్యర్థమే! భక్తి లక్ష్యం జీవేశ్వరైక్యం అని తెలిసి, శాస్త్రీయంగా చేసినట్లైతే స్వార్థం, అహంకారం మొదలైన వాటిని తొలగించుకోవలసి ఉంటుందని భాగవతం చెప్తు న్నది. భక్తి లక్ష్యం కోరికలు తీర్చుకోవడం కాదని, భగవంతుని అనుగ్రహం పొంది ఆయనతో హృద యగతమైన సాన్నిధ్యం పొందాలని ఇతిహాసాలు తెలుపుతున్నాయి. సర్వమూ భగవంతుడు ఇచ్చిన దే అయినప్పుడు మనం ఆయన కిచ్చేది మన దగ్గరే మున్నది? కాని ఆయన కోసం ధనం, బంగారం మొ దలగు వాటిని ఇచ్చే భక్తులను చూస్తున్నాం. ముక్తి కోసమే భక్తిగాని,

వేరే కారణంతో కూడిన భక్తి భక్తికాదని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే అది భగవంతుని మనలాం టివాడిగా భావించి చేసే వ్యాపారమౌతుంది. అయి నా ఆయన వీటన్నింటికి జవాబు చెప్పేవాడు కాదు. చలించే వాడు కాదు. ఆయన నిర్వికారుడు. ఏదైనా ఆశించిన ఫలితం వస్తే, అది ప్రాప్తిననుసరించి కర్మ ఫలంగా లభించేదేగాని, భగవంతుడు మనం కోరిన దానికి ఫలితంగా ఇచ్చింది కాదు. ఆయన ఎవరు చేసిన పుణ్యపాపాలకు తగిన ఫలితాన్ని వారికిస్తాన ని భగవద్గీతలో చెప్పాడు. కనుక ప్రాప్తి, అప్రాప్తి అనేవి సమత్వ దృష్టితో సర్వులకు నిర్ణయించబడి నవే గాని, మ్రొక్కినందు వలన ప్రాప్తించినవి కాదు. భక్తి అనే సత్కర్మ ఫలితంగా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అది ఆధ్యాత్మికమైన పురోగతి కలిగిస్తుంది. భగవంతుని పొందడం కోసమే భక్తి. దీనినే సాధనగా చేసికొని భక్తికి బదులుగా స్వార్థ రహితమైన, గుణరహితమైన భక్తిని అలవరచు కోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement