Sunday, November 24, 2024

సజ్జన సాంగత్యం శ్రేయోదాయకం

చందనం శీతలం లోకే. చందనా దపి చంద్రమా?
చంద్ర చందన యోర్మథ్యే
శీతలం సాధు సంగతి?
”లోకంలో చందనం చల్లగా ఉంటుంది. అంతకంటే వెన్నెల చల్లగా ఉంటుంది. సజ్జన సాంగత్యం ఈ రెండింటి కన్నా చల్లగా ఉంటుంది. ప్రహ్లాదుడు తన తోటి విద్యార్ధులకు ఇలా చెప్పాడు
”అందరు సంసారపు ఊబిలో కూరుకుపోయి తమ స్వరూపాన్ని కూడా తాము మరచిపోతున్నారు. వందలకొద్ది జన్మలెత్తినా కర్మ బంధాల. చిక్కులోంచి మనవారు బయటపడడం లేరు.” అలాగని ప్రహ్లాదుడు అంతటితో ఆగలేదు. ”భగవంతుడే భద్రత నిచ్చేవాడు. అతని శరణును ఎందుకు పొందరు?” అని #హతవు చెప్తాడు. ఇంకే ముంది దుష్ట ప్రవృత్తిగల ఆ రాక్షస పుత్రులలో మంచి పరివర్తన వచ్చింది. సజ్జనుడి స#హవాసం ఉంటే మంచి గుణాలు, బుద్ధులు అబ్బుతాయి. అదే దుర్జనుల స#హవాసంలో ఉంటే చెడు బుద్ధులే అలవడతాయని మనం అర్ధం చేసుకోవాలి. ఈ లోకంలో అడుగు పెట్టామంటే అప్రమేయంగానే అనేక బంధాలకు బందీ అయినట్లే నని తెలుసుకోవాలి. మనలను సక్రమ మార్గం వైపు నడిపే శక్తి కేవ లం సజ్జనులకే ఉంటుంది. ఒక మనిషి సజ్జనుడుగా పేరు ప్రతిష్ఠలు గడించినా, దుర్జనుడిగా అపకీర్తి పాలైనా అది సాంగత్యం వలననే సాధ్యం.” ఎంత దుష్టసంస్కారాలు గలవాడైనా సాధు సాంగత్యం చేత వృద్ధిలోకి వస్తాడు.
”అత్తరు దుకాణంలోకి పోతే ఆ వాసన నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కుకు సోకుతుంది” అంటారు శ్రీ రామకృష్ణ పరమ#హంస.
సాంగత్యం వల్లనే మనకు సంస్కారాలు అబ్బుతాయి. ప్రపం చంపై పెంచుకుంటున్న అనురక్తి సమస్త దు:ఖాలకు కారణం. ఈ అనుబంధం మనిషిని మోహంలో పడవేస్తుంది. ఈ మోహం జీవిని విముక్తుణ్ణి కానీయకుండా నిరంతరం చక్రంలో తిప్పుతూనే ఉం టుంది. అయితే లోభమోహాలను త్యజించడం దుస్సాధ్యం కాదు. అందుకు సత్పురుషుల స#హచర్యం అలవరచుకోవాలి. కాని స్వార్థ పూరిత ప్రపంచంలో మనలను మంచి దారిలో నడిచే మార్గదర్శనం చేసేవారు కరువవుతున్నారు.
స#హజీవనంపై వేదం ప్రత్యేక దృష్టిని చూపింది. సృష్టితో సామ రస్యం సాధించడమే వ్యక్తి ఔన్నత్యానికి నిదర్శనం. మనం కలిసి సాగించే జీవనగమనం ప్రగతికి, పురోగతికి మార్గం కావాలి. అయి తే ఇవి మనం ఎలా అలవరుచుకోగలం? కలసి నడుద్దాం, కలిసి మాట్లాడుదాం అని ఋగ్వేద మంత్రం ”సంగచ్చద్వం సంవద ద్వం”. అయితే ఇందుకు సత్ప్రవర్తన ముఖ్యం. మన వేదం చెప్పేది ఋషులు చెప్పేది ఒకటే! ఒక వ్యక్తి జీవనం ఇతర ప్రకృతిని నశింప జేసేదిగా ఉండరాదు.
మనం నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకు మనో వాక్యాయములచే ఎవరికినీ అపకారం కలుగుకుండనట్లు, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము కలుగనట్లు నడుచు కోవాలి. ఒకరు దు:ఖ పడుతూవుంటే వేరొకరు సుఖపడలేరు. అయితే దుష్టులు అందుకు విరుద్ధం. తమ స్వార్ధం కొరకు ఇతరులను #హంసిస్తారు. ఇదంతా తమ సంపదలు వృద్ధిచేసుకోవడానికి. అందులోనే సుఖం ఉందని భ్రమపడతారు. కాని వారికంటే మానసికంగా దు:ఖపడేవారు వేరె వరు ఉండరు. వారిలో పాపభీతి లోలోన వారిని కాల్చివేస్తుంది. ప్రకృతిలో క్షేమం అనేది పరస్పర స్నే#హం అనే ఏకసూత్రం మీదే సాధ్యమవుతుంది.
ఐక్యతలేనప్పుడు పొరుగువాని దు:ఖాన్ని చూసి మనస్సు ద్రవిం చని మనుష్యుల వలన మన సమాజం అభివృద్ధి గాంచలేదు. సంస్కారాలను ఉగ్గుపాలతో నేర్పాలని మన పెద్దలు అంటారు. మొక్కై వంగనిది మ్రానై వంగదని అందరికి తెలిసినదే. ”సత్యం వద ధర్మంచర” అనేది వేదమంత్రం. ‘సత్యాన్ని పలుకు, ధర్మమాన్ని ఆచ రించు’. అయితే అది సులభంగా అలవడదు. అందుకు సజ్జన సాంగ త్యం ఒక్కటే సాధన.
”ఇతస్తతో దూరతరం విహృత్య, ప్రవిశ్య గేహం దివసావసనే? వివేకి లోకాశ్రయ సాధుకర్మ రికే హ్న రాత్రౌ! క ఉపైతి నిద్రామ్‌? ఒక సందర్భంలో శ్రీరాముడు వశిష్ఠువితో అంటాడు ”నాకు ఒక విష యం చూస్తూవుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ జనులంతా ఏవేవో కార్యాలు రచించుకొని అందులో నిమగ్నులై పగలంతా అటూఇటూ తిరుగుతున్నారు. వివేకుల నాశ్రయించకుండానే, సత్కర్మలు నిర్వర్తించకుండానే సాయం కాలానికి ఇల్లు చేరుకుంటు న్నారు. రోజంతా ఎలాంటి వివేకం పొందకుండానే గడిచిపోతుంది కదా! ఇక వారికి రాత్రిపూట ఎలా నిద్రపడుతుంది? ఇలా ఒక రోజు వృధా అయినందుకు చింతించరేం?”
”వివేకశూన్యంగానే మన రోజువారీ జీవితాలు గడిచిపోతున్నా యి. ఎటు వెళుతున్నామో తెలియకుండా పరుగులు తీస్తున్నాం. విషయ ప్రపంచం చుట్టూ వెఱ్ఱిగా తిరుగాడుతున్నాం. జీవితాన్ని త్యాగం చేసి, పరుల సేవలో తరించిపోతున్న సాధుపుంగవులు, సత్పురుషులు మన మధ్యే పరమ పవిత్రంగా జీవిస్తూ దారిదీపాల్లా కనిపిస్తూనే ఉంటారు. కాని మనం మాత్రం కళ్ళు మూసుకుని మనం సృష్టించుకున్న సంకుచిత ప్రపంచమే పరమావధిగా భావించు కుంటూ, వెఱ్ఱి బాగుల వాళ్ళలా మిగిలిపోతున్నాం.
”సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం లేదా దుష్ప్రవర్తన దుర్జన సాంగ త్యం వలన ఎలాంటి పరిణామాలుంటాయో తెలిపే రెండు చిలకల కథ మనం వినే ఉంటాం.
అది తిరిగి రాయవలసిన అవసరంలేదు. గంగానది పాపాన్ని పోగొడుతుంది. వెన్నెల తాపాన్ని పోగొడుతుంది. కల్పవృక్షం దైన్యా న్ని పోగొడుతుంది. అయితే ఈ మూడింటినీ సజ్జన సాంగత్యం పోగొడుతుంది.
అందువలన సజ్జన సాంగత్యమే శ్రేయోదాయకమైనది.

– గుమ్మా నిత్యకళ్యాణమ్మ
9755110398

Advertisement

తాజా వార్తలు

Advertisement