మంచి, చెడులు రెండు గురువులే. మంచిని చూస్తే చెయ్యాలనిపిస్తుంది. చెడును చూస్తే వదిలేయాలనిపిస్తుంది. ఎవరి సంస్కారాన్ని బట్టి వారు దానిని అనుసరిస్తారు. ఈ లోకం ఒక పెద్ద తోట లాంటిది. తోటలోనికి కోకిల వస్తేపండ్ల నిమిత్తం మామిడి చెట్టు వెతుకుతుంది. కాకి వస్తే వేప చెట్టు వెతుకుతుంది. తుమ్మెదలు తేనె కోసం మంచి పూల చెట్లను వెతుకుతాయి. ఈగలు మలాన్ని వెతుకుతాయి. సాలగ్రామం కావలసిన వాడు రాళ్ళని వెతికి తనకు కావలసిన సాలగ్రామం మాత్రమే తీసుకుంటాడు. అది పూజకు
ఉపయోగపడుతుంది. తక్కిన రాళ్లతో వానికి పనిలేదు. మంచి చెడులు నాణనికి రెండు పార్స్వాలు లాంటివి. అందువలన ఏది చేసినా అది మంచిదే కావాలి. మూర్ఖంగా చెడు చేస్తామనే వారు, చెడు చేసేవారు, జి#హ్వకో రుచి అన్నట్లు ఉంటారు. దాని వలన శాంతి భంగమైనా, ఇతరులకు బాధ కలిగించేది అయినా, పర్యావరణం కలుషితం అయినా అది తమ సంతోషం, తమ #హక్కు అనుకుంటారు. అది సంస్కృతికి విరుద్ధం ఆని వారికి తట్టదు.
మన సంస్కృతిలో కాలంతో పాటు ఎన్నో పరిణామాలు వచ్చాయి. మారుతున్న రీతులకు అవసరమైన మేరకు చోటు కల్పిస్తూనే మంచి సంస్కరణలు చేసుకుంటూ ఒక శక్తివంతమైన ధర్మంగా నిలుపుకుంటూ వస్తున్నాము. అయితే సంప్రదాయాల పరమార్ధాన్ని ఆలోచించకుండానో, తెలుసుకోవడానికి ప్రయత్నించకుండానో, లేకతొందరపాటు పరిశీలన కారణంగానో చక్కని ఆచారవ్యవహారాలకు హాని కలిగిస్తున్నాము. కొన్ని అవకతవకల్ని కలిపేసుకుంటున్నాం.
వేరొకరు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పా? అనే తర్కంలోనికి దిగుతున్నాం. చెడు పని ఎవరు చేసినా మంచిది కాదు. అస#హనంతో పోటీకి దిగడం మరింత తప్పు. ఇద్దరు ఒకచెడు పని చేస్తే అది మంచిదవుతుందా? ఉత్సవాల్లో మైకునలు విపరీతంగా ఉపయోగించడం ఒక విచిత్రమైన పరిణామం. వెం పెళ్లి నపా చావు కొచ్చింది అన్న్టు ఎవరిదో పెళ్లి అయినప్పుడు రోడ్ల మీద వెళ్లేవారు వాళ్ల పాటల గోల, బ్యాండ్ సంరంభం వినాలా? రోడ్డు మీద నడిచేవారి చెవులు చిల్లులు పడవా? ఇది శబ్ద కాలుష్యం కాదా? రోడ్డంతా వారు ఆక్రమిస్తే ట్రాఫిక్ జామ్ కాదా? ఇతరులకు ఇబ్బంది కలిగించడం మన సంస్కృతి కాదు. నవరాత్రులు, గణషోత్సవాలు
ఇలా అనేక పండుగలను మనం జరుపుకుంటాం. ఇలాంటి ఉత్సవాలు మనం శతాబ్దాలుగా జరుపుకుంటున్నాం. జరుపుకో వడం మన ధర్మం. అయితే మైకులు పెట్టి చుట్టు పక్కల ఇళ్ళలో శాంతి లేకుండా చేయడం, చదువుకునే విద్యార్ధుల ఏకాగ్రతకు భంగం కలగించడం, వృద్ధులకు, రోగులకు అసౌకర్యం కలిగించడం హర్షనీయం కాదు.
దీనికి తోడు ఎన్నికల ర్యాలీలూ, రోడ్డు నడి బొడ్డులో బహిరంగ సభలు. వీటిలో లౌడ్ స్పీకర్లు తప్పక ఉంటాయి. ఇవి శబ్ద కాలుష్యానికి దోహదం చేస్తాయి. ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్లు శబ్ద కాలుష్యానికి దోహదం చేస్తాయి. వాటిని వాడవచ్చు కాని ఆ ధ్వని ఆ పరిసరాల దాటి బయటకు రాకుండా చూడాలి. పవిత్రతనీ, ప్రశాంతతనీ, అభయాన్నీ కలిగించవలసిన మత సంప్రదాయాలు కలవరపరిచే విధానాలుగా మారడం శోచనీయం.
విదేశాలలో ఎవరి ప్రార్థనలు, ఎవరి ఉత్సవాలు వారివే. అలాంటి పద్ధతి సమాజ జీవనంలో అల్లకల్లోలాను రేపదు. విదేశీయుల నుంచి ఏమైనా నేర్చుకోవాలను కుంటే ఇలాంటి మంచిని నేర్చుకోవాలి. ఎన్నో ఉదాత్త తాత్విక భావాలూ, తాత్విక రీతులూ కలిగిన మన ధర్మంలో ఇలాంటి రీతులు జొరపడడాన్ని మనమందరం నిర్మూలించాలి. ఇలాంటిసంస్కృతి విరుద్ధ చర్యలు మనం చేయరాదు, వేరోకరు చేస్తే వారిని వారించే ప్రయత్నం చేయాలి. ప్రకృతి వికృతి కారాదు. మన సంస్కృతి పర్యావరణ అనుకూలంగా ఉండాలని శాస్త్రజ్ఞులు, ఋషుల సద్వచనం. మనం కోకిలలా ఉండాలా, కాకిలా ఉండాలా, ఇదిమనం ఆలోచించాలి.
గుమ్మా ప్రసాదరావు (భిలాయ్)
97551 10398