వివాహం అయిన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించి కలలు కంటుంటారు. సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యం అయినా కలత చెందుతారు. భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. సంతానం కోసం తపించే వారికి గోసేవ చాలా అవసరం. సకల దేవతలు కొలువై వుండే గోమాతను పూజించినా, సేవ చేసుకున్నా గత జన్మ పాపాలు నశిస్తాయట. పసిపాప ఆకలి తీర్చడం దగ్గర నుంచి శివునికి అభిషేకం చేయడం వరకూ గోవు పాలు ఎంతో విశిష్టమైనవి. అలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగ డమే గొప్ప విషయం. గోమాతకి అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. ప్రతిరోజు తాము భోజనం చేసే సమయం లో కొంత భాగాన్ని గోవుకు పెట్టాలట. ఇలాచేస్తే వాళ్ల కోరిక అనతి కాలంలోనే తీరుతుందని స్కాంద పురాణం చెబుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement