మనం ఏకాంతంలో కూర్చొని ఆలోచనా సాగర మధనం చేసే అలవాటయితే పరచింతన, దోష దృష్టి, వ్యర్ధ చర్చలో సమయాన్ని, శక్తిని నష్టపరుచుకొనకుండా రక్షించుకొనగలము. మన బుద్ధి జ్ఞాన రసం త్రాగుటలో మునిగిపోవుటచేత వ్యర్థం సంకల్ప వికల్పాలు రావడానికి అవకాశమేది? కావున మనసు వ్యాకులత్వంతో, చంచలత్వంతో, వ్యర్ధత్వం, సందిగ్ధత్వం నుండి రక్షించుకొనే పద్ధతి ఒక్కటే ఆలోచనా సాగర మధనం అంతకు ముందు మన మనసులో పెంపొందిన వికారాలు నిర్జీవ మవుతాయి. మనలోని సంకల్పాల తుఫానులు క్షీణించి శాంతిస్తాయి. విషయవాసనలు తొలిగిపోతాయి. ఎన్ని లాభాలు విచార సాగర మధనం వలన ఉన్నాయో చూడండి
…బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి