ప్రఖ్యాత షిర్డీ సాయిమందిరం దర్శనానికి భక్తులను అక్టోబర్ ఐదు నుంచి అనుమతించనున్నారు. ఈ మేరకు సాయిబాబా సంస్థాన్ ట్రస్టు కార్యనిర్వహణ అధికారి భాగ్యశ్రీ బానాయత్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అన్ని విభాగాల సిబ్బందిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో షిర్డీ సాయి మందిరాన్ని తెరవాలని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement