Saturday, November 23, 2024

శ్రేయోదాయకం సజ్జన సాంగత్యం


”లోకంలో చందనం చల్లగా ఉంటుంది. అంతకంటే వెన్నెల చల్లగా ఉంటుంది. సజ్జన సాంగత్యం ఈ రెండిటికన్నా చల్ల గా ఉంటుంది. ప్రహ్లాదుడు తన తోటి విద్యార్ధులకు చెప్పాడు ”అందరు సంసారపు ఊబిలో కూరుకుపోయి తమ స్వరూపాన్ని కూ డా తాము మరచిపోతున్నారు. వందల కొద్ది జన్మలెత్తినా కర్మబంధా ల. చిక్కులోంచి మనవారు బయటపడడం లేరు.” అలాగని ప్రహ్లాదు డు అంతటితో ఆగలేదు. ”భగవంతుడే భద్రత నిచ్చేవాడు. అతని శర ణు నెందుకు పొందరు?” అని #హతవు చెప్తాడు. ఇంకేముంది దుష్ట ప్రవృత్తిగల ఆ రాక్షసపుత్రులలో మంచి పరివర్తన వచ్చింది. సజ్జనుడి స#హవాసం ఉంటే మంచి గుణాలు, బుద్ధులు అబ్బుతాయి. అదే దుర్జనుల సహవాసంలో ఉంటే చెడు బుద్ధులే అలవడతాయి.
ఈ లోకంలో అడుగుపెట్టామంటే అప్రమేయంగానే అనేక బంధా లకు బందీ అయినట్లేనని తెలుసుకోవాలి. మనలను సక్రమ మార్గం వైపు నడిపే శక్తి కేవలం సజ్జనులకే ఉంటుంది. ఒక మనిషి సజ్జనుడుగా పేరు ప్రతిష్ఠలు గడించినా, దుర్జనుడిగా అపకీర్తి పాలైనా అది సాంగ త్యం వలననే సాధ్యం. ”ఎంత దుష్ట సంస్కారాలు గలవాడైనా సాధు సాంగత్యం చేత వృద్ధిలోకి వస్తాడు.
”అత్తరు దుకాణంలోకి పోతే ఆ వాసన నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కుకు సోకుతుంది” అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. సాంగ త్యం వల్లనే మనకు సంస్కారాలు అబ్బుతాయి. ప్రపంచంపై పెంచు కుంటున్న అనురక్తి సమస్త దు:ఖాలకు కారణం. ఈ అనుబంధం మనిషిని మోహంలో పడవేస్తుంది. ఈ మోహం జీవిని విముక్తుణ్ణి కానీయకుండా నిరంతరం చక్రంలో తిప్పుతూనే ఉంటుంది. అయితే లోభమోహాలను త్యజించడం దుస్సాధ్యం కాదు. అందుకు సత్పురు షుల స#హచర్యం అలవరచుకోవాలి.
స#హనంపై వేదం ప్రత్యేక దృష్టిని చూపింది. సృష్టితో సామరస్యం సాధించడమే వ్యక్తి ఔన్నత్యానికి నిదర్శనం. మనం కలిసి సాగించే జీవన గమనం ప్రగతికి, పురోగతికి మార్గం కావాలి. కలసి నడుద్దాం, కలిసి మాట్లాడుదాం అని ఋగ్వేద మంత్రం ”సంగచ్చద్వం సంవద ద్వం.” అయితే ఇందుకు సత్ప్రవర్తన ముఖ్యం.
వివేక శూన్యంగానే మన రోజువారీ జీవితాలు గడిచిపోతున్నా యి. ఎటు వెళుతున్నామో తెలియకుండా పరుగులు తీస్తున్నాం. వెన్నె ల తాపాన్ని పోగొడుతుంది. కల్పవృక్షం దైన్యాన్ని పోగొడుతుంది. అయితే ఈ మూడింటీని సజ్జన సాంగత్యం పోగొడుతుంది. అందు వలన సజ్జన సాంగత్యమే శ్రేయోదాయకమైనది.

– గుమ్మా నిత్యకళ్యాణమ్మ
9755110398

Advertisement

తాజా వార్తలు

Advertisement