అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహ చ పార్వతీ
మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర:
బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్!!
ఈదసరా నవరాత్రులలో ఐదవరోజు పంచమి, షష్టి తిథుల కలయిక వలన అమ్మవారిని అన్నపూర్ణ మాతగాను, మహాలక్ష్మీదేవిగాను కొలుస్తారు.
సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి జగత్కారిణి. త్రిమూర్తులకు పెద్దమ్మగా పిలువబడే ఈమె ఒక చేతిలో అక్షయ పాత్రతో మరొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది కావున ఈమెను అన్నపూర్ణగా పూజిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరునికే బిక్షనొ సంగిన అన్నపూర్ణ అక్షయములైన శుభాలను కలిగిస్తుంది. హిందూ సంప్రదాయంలో అన్నమును పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తారు, ఒకసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య వాగ్వాదం చెలరేగి పార్వతి అలిగి కైలాసమును వీడి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పార్వతి కైలాశం వీడి వెళ్ళిపోతుందో అప్పటి నుండి శివునకు అన్నం దొరకక ఇబ్బంది పడతాడు. ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొనేందుకు ప్రయత్నం చేయ గా ఎవరి ఇంటా అన్నం దొరకక క్షామము ఏర్పడుతుంది. అప్పడు పరమేశ్వరుడు పార్వతి జాడ తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె అన్నపూర్ణగా కాశీలో అన్నం దానం చేస్తుందని తెలుసుకుని తన పుత్రు లతో కలసి అక్కడివెళ్ళి ఆమెను అన్నమునకై భిక్షాటన చేస్తాడు. ఆమె ప్రసన్నురాలై శివునకు, తన కుమారులకు అన్నం ప్రసాదిస్తుంది. అప్పటినుండి లోకమంతా క్షామము తొలగి సుఖశాంతుతో ఉంటా రు. అప్పటినుండి పార్వతీదేవిని అన్నపూర్ణమాతగా ఆరాధించి అన్న వస్త్రాలకు లోటురాకుండా జీవించారు. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకము.
అన్నపూర్ణాష్టకమ్
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహ కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ!!
ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకము చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.
మహాలక్ష్మీ అవతారం
మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని హృదయసుందరి. పార్వతీ దేవిని ముగ్గురమ్మల మూలమూర్తిగా కొలుస్తారు. సర్వజగత్తుకు మూలకారణమైనది. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషా లకు, సంతానానికి ప్రతీక. జగత్తు స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువునకు తోడుగా మహాలక్ష్మి ఉద్భవించినదని దేవీభాగవతంలో చెప్పబడి నది. భృగు మ#హర్షి కుమార్తెగా జన్మించిన కారణముగా ఈమెను ‘భార్గవి’ అని కూడా పిలుస్తారు. తదనంతర కాలంలో ఈమె దూర్వా సుని శాపం కారణంగా పాలసముద్రము నుండి తిరిగి ఉద్భవిం చింది. ఈమెను చంద్ర సహోదరి అని కూడా వ్యవ#హరిస్తారు.
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్!!
విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాత, మహాలక్ష్మీగాను దర్శనమిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబ స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. స్కందుడు అనగా కుమారస్వామి తల్లిగా పద్మాస నంలో విరాజిల్లే రూపంగా దర్శనమిచ్చే అవతారం స్కందమాత. ఈ తల్లి కమలాసనంపై శ్వేతపద్మంతో విరాజిల్లుతుంది. తన చేతులలో చెరకు గడ, విల్లు, పాశాంకుశాలు ధరించి, తనకు కుడివైపున లక్ష్మీ దేవి, ఎడమ వైపున సరస్వతీదేవి కలిగి ఉండి సకల లోకాలకు అతీత మైన సున్నితమైన మాతస్వరూపంతో దర్శనమిచ్చే రూపం. గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిరియాల పొం గలి నివేదన చేయాలి. నీలం రంగు వస్త్రము లతో అలంకరిస్తారు.
– డా. దేవులపల్లి పద్మజ
98496 92414