1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు
108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము
స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ,
సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ
2-2-2022 నుండి 14-2-2022
శ్రీరామనగరం, శంషాబాద్, హైదరాబాద్, భారత్-509325
– భగవద్బంధువులందరికీ హార్ధిక స్వాగతం
అందరి దు:ఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తా
మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే
ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది
ఆతని ఆలయం ప్రవేశించే అర్హత అతీతంగా అందరిదీ
– రామానుజాచార్యులు
– జనాహసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనుల మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్ధ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగా తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత శ్రీరామానుజాచార్య స్వామి
– ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకి, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటు-ంబ భావనకు ఊపిరులూదిన సంఘ సంస్కర్త శ్రీరామానుజాచార్య స్వామి
– వైదిక వాజ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాక చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత శ్రీరామానుజులు
– మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారంచేసే వివిధ సంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము శ్రీరామానుజాచార్య స్వామి
శ్రీరామానుజాచార్య స్వామివారి వైష్ణవ ప్రేమతత్త్వంలో మునిగి తేలిన మహనీయులే గాయక సార్వభౌములుగ ప్రసిద్ధి చెందిన కృష్ణమయ్య. కబీరు, మీరాబాయి. అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు ప్రభృతులంతా. ఆలయాలను పాలనా కేంద్రాలుగ రాజ్యాలు కలిగి ఉండే ఆ రోజులలోనే ఏకవర్ధపాలనను ప్రక్కన పెట్టి, 50 శాతం పాలనాధికారాలను సమాజంలోని అన్ని వర్గాలకు అనుగ్రహించిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యస్వామి.. ఏడీ 1017,
శ్రీపెరుంబూదూరులో అవతరించారు. భారత భూభాగాన్నంతటిని పలుమారులు పర్యటించి పావనం చేసారు. అనుభవ పూర్ణమైన ప్రజ్ఞాపాటవాలతో ప్రతివృత్తిని పరిశీలించారు. సర్వజన హితాని-కై- సర్వజన ముఖానికి సర్వవేదసారమైన సూక్ష్మార్ధాలను 9 గ్రంథాలు రచించారు. మంచి హృదయంతో గురువులను, పాలకులను, ప్రభువులను, పండితులనూ పామరులను మెప్పించి భక్తి బాటపై ఏకోమ్మఖంగ నడిపించారు.
ప్రపంచంలో పేరుగాంచిన. ఆధునికులు మాట్లాడే సమతా సిద్ధాన్తాలన్నీ శ్రీరామానుజులనే మహానది నుండి పారిన పిల్లకాలువలంటే ఆశ్చర్యమేస్తుంది కదూ! కానీ ఇది చరిత్ర చెప్పే వాస్తవం. ఆ మహనీయులు అవతరించి వేయేండ్లైంది. ఆ మహనీయుడి ప్రేమనిండిన పలుకులను పలువురు వాడుకుంటూన్నా ఆ రామానుజులపేరును మాత్రం మరుగున పరిచారు. సమాజం తిరిగి పతనావస్థకు చేరింది.
– కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, ఆస్తులూ, అంతస్తులూ, పార్టీల పేరుతో మనుష్యుల మధ్య ఉక్కు గోడలు లేస్తున్నాయి. సమతావాదం మాటలకే పరిమితమైపోయింది. ఆనాటి రామానుజులవనరం ఈనాటి సమాజానికి మళ్ళి ఏర్పడింది. వారి శ్రీమూర్తి శ్రీసూక్తి ఈ మానవ జాతికి, స్ఫూర్తినిస్తాయి. వారి వేయేండ్ల పండుగ కంటే ఈ స్ఫూర్తిని పొంది ఉత్తమమైన సమయం మరేమున్నది కనుక అందుకే ఏర్పడింది సమతామూర్తి స్పూర్తి కేంద్రం…
ఇందులో..
-ఆకాశమే హ్దదన ఆచార్యులదివ్వరూపాన్ని 216 అడుగుల పంచలోహమూర్తిగ దర్శించవచ్చు.
-ఆచార్యచంద్రునికో నూలుపోగన్నట్లు- వారిని సువర్ణమూర్తిగ నిత్యమూ ఆరాధించవచ్చు.
-ప్రతి సాయంకాలమూ, కమలంలోంచి ఆవిర్భవించి కృపను నలుదిశెలా కురిపిస్తూండే శ్రీరామానుజులవారిని నృత్యం చేసే ప్రేమజలాలతో అభిషేకించవచ్చు.
– ఆధునిక సాంకేతిక విజ్ఞానం సహాయంతో శ్రీరామానుజుల చిరిత్రలోంచి కొన్ని స్ఫూర్తిదాయక సన్నివేశాలను ఆయా సమయాలలో సందర్శించవచ్చు.
-ఇలాంటివి మరెన్నో మరెన్నో ఈ మహోత్సవాలలో సందర్శించబోతున్నాము.
ఈ సమారోహంలో శ్రీలక్ష్మి నారాయణ మహాక్రతువు 1935హోమకుండాలతో జరుగుతుంది. దీనిని సుమారు 5000 మంది ఋత్విక్కులు| నడిపిస్తారు. వారిలో నాలుగు వేదాలకు చెందిన 7 శాఖలనారాయణ, హవనము 10 కోట్లు- అష్టాక్షరీ మహామంత్రి జపమునకు అంగముగ కోటిసార్లు మంత్ర హవనము, వివిధ పురాణ, ఇతిహాస, అగమ గ్రంథముల పారాయణము జరుగుతాయి. దీనితోపాటు- ఆయా దివ్యదేశాల నుంచి తెచ్చిన శ్రీ సాలగ్రామ మూర్తి, దివ్య మృత్తికా ఆయా సన్నిధులలో చేర్చి 108 దివ్యదేశాల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. వీనిని సేవించడానికి భక్తితో విచ్చేసే భగవద్బంధువులందరికీ నిరంతరమూ తదీయారాధనాది సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతి రోజూ కనీసం లక్షమందికి పైగా ఈ తదీయారాధన గోష్ఠిలో ప్రసాద స్వీకరణ చేస్తారు. ఇదొక అద్భుతమైన, అపూర్వమైన సన్నివేశము. ఇందులో పాల్గొనగలగడం ఓ అదృష్టం. సేవలందించడం మరింత అద్భుతం. ధనాదిరూపంగ ప్రోత్సహిస్తూ పాల్గొనగలగడం సకల పుణ్య ప్రదము. మనందికోసం ఈ ఉత్సవం. ఇప్పటి నుండే సిపడండి. మన బంధుమిత్రులతో కలిసి పాల్గొందాం.
తరిద్దాం.!! తరింపచేద్దాం.. !!