Saturday, November 23, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి
ఆదాయం-02, వ్యయం-08
రాజ పూజ్యం-07, అవమానం-03

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9. 2021 వరకు మరల 20.11. 2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో, 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కు టు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటు-ంది. రాజకీయ నాయకులకు ముఖ్య మైన పదవులు పొందుట వంటి శుభ పరిణామములు కలుగు తాయి. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకర రాశిలో 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యా లపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 9వ స్థానమై అశుభుడైనందున మానసి కాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ఫలితములు ఉండవు.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 వత్సరాంతం వరకు వృషభరాశిలో 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటు-ంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటు-ంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 వత్సరాంతం వరకు వృశ్చిక రాశిలో 7వ స్థానమై సాధారణ శుభు డైనందున అనారోగ్య బాధలను అధిగ మిస్తారు. నూతన కార్యాలకు ఆటంకా లున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మొ త్తము మీద పూర్వార్ధము, ఉత్తరార్ధ ములలో కొ న్ని ఇక్కట్లు తప్పవు.

కావున నవగ్రహ ముల అనుగ్రహం కోసం శ్రీ నృషింహ కవచాన్ని, సుదర్శ న శతక పారాయ ణతో పాటు కృత్తిక వారు కెంపును, రోహిణి వారు ముత్య మును, మృగశిర వారు పగడమును ధరించిన కార్యసిద్ధి కలుగును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement