వృశ్చిక రాశి
ఆదాయం-08, వ్యయం-14
రాజ పూజ్యం-04, అవమానం-05
ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 4వ స్థానంలో అశుభుడై నందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. సంఘంలో పేరు ప్రతిష్టలు కాపాడుకొను టకు తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటు-ంది అనారోగ్య సూచనలు, వృధా శ్రమ, అనేక అపనిందలు, అపవాదలు వంటి అశుభ ఫలితములు కలిగే అవకాశం ఉన్నది. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 3వ స్థానంలో సాధారణ శుభుడైనందున బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుం టాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటు-ంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్స రాంతం వరకు మకరరాశిలో 3వ స్థానంలో శుభుడైనందున కుటు-ంబమంతా సంతోషం గా నుంటారు. గతంలో వాయిదావేసిన పను లన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటు-ంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి.
ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 వత్సరాంతం వరకు వృషభరాశి లో 7వ స్థానంలో సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటు-ంది.
ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చిక రాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ రాశివారు నవగ్రహ మఖం, సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, శని, మంగళ, గురువార నియమములతో పాటు- విశాఖవారు పుష్యరాగమును, అనూరాధ వారు నీలమణిని, జ్యేష్ఠ వారు పచ్చను ధరించిన శుభఫలితములు పొందగలరు.
– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి