Friday, October 4, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర మిథున రాశి ఫలాలు

మిథున రాశి
ఆదాయం-05, వ్యయం-05
రాజ పూజ్యం-03, అవమానం-06

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో, 9వ స్థానమై శుభుడైనం దున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. కోర్టు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సంఘములో పేరు ప్రతిష్ఠలను గడిస్తారు. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 8వ స్థానమై అశుభుడైనందునమనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. దూరంగా వుంటారు.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదుర వుతాయి. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణ ప్రయత్నం చేస్తారు. కుటు-ంబ విషయాల్లో మార్పులు వుంటాయి. ఆకస్మిక భయాందోళనలు, రావలసిన ధనము పూర్తిగా అందక పోవుట, వృత్తి వ్యాపారములయందు ఆందోళన కలిగించే పరిస్థితులు మొదలగు ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్థానచలన సూచనలున్నాయి.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో | కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటుంది.

రాహువుకు వామనావతార స్త్రోత్రమును, వరాహావతార స్త్రోత్రమును, ఆదిత్యహృదయ పారా యణ, ఆంజనేయ స్వామికి ఆకుపూజలతో పాటు మృగశిర వారు పగడమును, ఆరుద్రవారు గోమేదికమును, పునర్వసు వారు పుష్య రాగమును ధరించినచో శుభ ఫలితములు కలుగును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement