మకర రాశి
ఆదాయం-14, వ్యయం-14
రాజ పూజ్యం-03, అవమానం-01
ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటు-ంబ సౌఖ్యముంటు-ంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటు-ంది.
రావలసిన ధనము సకాలమునకు అందుతుంది. రాజకీయ నాయకులు పదవులను పొందుతారు. కోర్టు పనులు అనుకూలిస్తాయి. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటు-ంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 1వ స్థానమై అశుభుడైనందున బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.
ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పటు-దలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు.
ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.
ఈ రాశి వారలకు జపదానములతో పాటు సుదర్శనశతక పారాయణ, శ్రీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణతో పాటు, ఉత్తరాషాఢ వారు కెంపును, శ్రవణం వారు ముత్యమును, దనిష్ఠవారు పగడమును ధరించిన అత్యంత శుభ పరిణామములు కలుగును.
– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి