Friday, October 4, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి
ఆదాయం-11, వ్యయం-05
రాజ పూజ్యం-07, అవమానం-05

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14. 9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 3వ స్థానంలో సాధారణ శుభుడైనందున బంధు, మిత్రులతో విరోధ మేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటు-ంది. మానసికాందోళనతో కాలం గడు స్తుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితము లభించుట కష్టము. రాజకీయ నాయకులు ప్రజలలో నమ్మకమును కోల్పోయే పరిస్థితి ఏర్పడును. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకర రాశిలో 2వ స్థానమై శుభుడైనం దున ధర్మకార్యాలు చేయుట యందు ఆసక్తి పెరుగు తుంది. దైవదర్శనం చేసుకుం టారు. కుటు-ంబసౌఖ్యముంటు-ంది.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 2వ స్థానంలో శుభుడైనం దున కుటు-ంబకలహాలు దూరమవు తాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగును.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 6వ స్థానమై శుభుడైనం దున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 12వ స్థానరైలో శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.

ఈ రాశివారలకు గురు, శని, రాహు, కేతు గ్రహమూలక ఇబ్బందులు కల్గును, కావున వారు సుందరకాండ పారాయణ, ఆదిత్యహృ దయ పారాయణ, ముకున్దమాల స్తోత్రముతో పాటు మూలవారు వైడూర్యమును, పూర్వాషాఢవారు వజ్రమును, ఉత్తరాషాఢవారు కెంపును ధరించిన శుభములు కల్గును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement