Friday, October 4, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర తుల రాశి ఫలాలు

తుల రాశి
ఆదాయం-02, వ్యయం-08
రాజ పూజ్యం-01, అవమానం-05

ఈ సం|| గురుడు ఉగాది 13.4. 2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 5వ స్థానమై శుభుడైనం దున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటు-ంది. ఆకస్మిక ధనలాభాన్ని పొం దుతారు. కుటు-ంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. వెండి, బంగారు ఆభరణములు, వాహనములు కొనుగోలు చేయుదురు. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 4వ స్థానంలో అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణ ప్రయత్నాలు చేస్తారు.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 4వ స్థాన ంలో అశుభుడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. రాజకీయ, సామాజిక సేవా రంగముల వారికి ఆటంకములు కలుగును.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 8వ స్థానంలో అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబపరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి.

కావున వీరు శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామ హృదయము, సూర్యనమస్కారములతో పాటు, చిత్తవారు పగడమును, స్వాతివారు గోమేదికమును, విశాఖ వారు పుష్యరాగమును ధరించిన మేలు కల్గును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement