కుంభ రాశి
ఆదాయం-14, వ్యయం-14
రాజ పూజ్యం-06, అవమానం-01
ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటు-ంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది. స్థాన చలనము, యశోహాని, వృత్తి యందు చిక్కులు కలుగును. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 12వ స్థానమై అశుభుడైనందున ఋణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి.
ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. ద
ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 4వ స్థానంలో అశుభుడైనందున చాంచల్యం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు.
ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈ రాశివారలకు జప, దాన, హోమాదులతో పాటు దశావతార స్తోత్రము, శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము, శ్రీనారాయణ కవచముతోపాటు ధనిష్ఠవారు పగడమును, శతభిషం వారు గోమేదికమును, పూర్వాభాద్ర వారు పుష్య రాగమును ధరించిన శుభఫలితములు కలుగును.
– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి