Sunday, November 24, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు


కర్కాటక రాశి
ఆదాయం-14, వ్యయం-02
రాజ పూజ్యం-06, అవమానం-06

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 8వ స్థానంలో అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, పై అధికారులతో మాట పట్టింపులు కలుగవచ్చు. కుటు-ంబ కలహములు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారములు అనుకూలించక పోవుట మొదలగు వ్యతిరేక ఫలములు కలుగుతాయి. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 7వ స్థానంలో శుభుడైనందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించుట మంచిది.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటుంది.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పట్టు-దలతో కొన్ని కార్యాలు పూరిచేసుకోగలుగుతారు జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి.

వీటి అనుగ్రహము కోసం దశావతార స్తోత్రములు, సుదర్శనాష్టకమ్‌, ఆదివారం శనివారం, మంగళవార నియమాలతో పాటు పునర్వసు వారు పుష్యరాగమును, పుష్యమి వారు నీలమును, ఆశ్లేష వారు పచ్చను ధరించిన సర్వ శ్రేయోదాయకముగా వుండును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement