Friday, October 4, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

కన్యా రాశి
ఆదాయం -05, వ్యయం -05
రాజ పూజ్యం-05, అవమానం- 02

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాంతం వరకు కుంభరాశిలో 6వ స్థానంలో సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటు-ంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. శుభవార్తాశ్రవణము స్వశక్తి, సామర్థ్యములతోనే రాణించగలరు. రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది. కోర్టు వ్యవహారములు సంతృప్తికరముగా పరిష్కారమగుటకు శ్రమ పడవలసి ఉంటు-ంది. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరాశిలో 5వ స్థానంలో శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటు-ంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటు-ంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 5వ స్థానంలో అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి.. రాజకీయ నాయకులకు సంఘంలో ప్రజలతో ఒత్తిడులు, అవమానములు కలిగే అవకాశమున్నది.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 9వ స్థానంలో సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 3వ స్థానంలో శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.

కావున వీరు పంచాయిధ స్తోత్రము, దశావతార స్తోత్రము, ఆంజనేయ సహస్రనామ స్తోత్రము చేసుకొనుట మంచిది. ఉత్తరవారు కెంపును, హస్తవారు ముత్యమును, చిత్తవారు పగడమును ధరించిన శుభఫలితములు పొందగలరు.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement