తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. కాగా, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కటాక్షించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement