Sunday, November 24, 2024

శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ప్రభన్యూస్‌: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షే త్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపా టు- నిర్వహిస్తారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం నాడు భ్రమరాంబ మల్లికార్జున స్వా మి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై వేంజేయించి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్‌. ఎస్‌ లవన్న అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రతిష్ట అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ప్రధాన రాజగోపురం ప్రజల వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామోత్సవం నారికేళ సమర్పించి గ్రామోత్సవం ని ప్రార ంభించగా ఈ గ్రామోత్సవం అంకా లమ్మ గుడి నంది మండపం వివిధ ఆలయ పురవీధుల గుండా గ్రామో త్సవం నిర్వహించారు ఈ గ్రామో త్సవంలో గురువయ్య డప్పు నృ త్యాలు బుట్ట బొమ్మలు నృత్యాలు శివయ్య వేషధారణలు కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆక ట్టు-కున్నాయి ఈ గ్రామోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఎస్‌ లవన్న ఈ వో లు హరిదాసు ఫణింద్ర ప్రసాద్‌ పర్యవేక్షకులు అయ్యన్న సాయి కుమారి. పి ఆర్‌ ఓ శ్రీనివాస రావు. శ్రీశైల ప్రభ ఎడిటర్‌ అనిల్‌. శ్రీశైల భద్రత విభాగం అధికారి నరసింహారెడ్డి అర్చకులు వేద పండితులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
నేడు హంసవాహన సేవ
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మ వాళ్లు హంసవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న రని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి. ఎస్‌ ఎస్‌ లవన్న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement