Saturday, November 23, 2024

శ్రీశైలంలో కనుల పండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు

శ్రీశైలం, ప్రభన్యూస్‌: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. జ్వాలాతోరణం, పుణ్యనదీ హారతి కార్యక్రమం కన్నుల పండువగా సాగాయి. వేదపండితులు కృష్ణా నదికి శాస్త్రోక్తంగా దశహారతులు ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్‌. లవన్న ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ఏర్పాటు-చేసిన జ్వాలాతోరణానికి ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలం, అయోధ్యగిరిపట్నంకు చెందిన వసుంధరరావు ప్రత్యేకంగా నేసిన నూలును దేవస్థాన అధికారులకు సాంప్రదాయ బద్ధంగా అందజేశారు. ముందుగా నూలుపోగులకు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్‌.లవన్న, ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రోక్షణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7.30కి ఆలయ ముందు భాగాన ఉన్న గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన ఈ నూలును ఉపయోగించి జ్వాల తోరణాలు వెలిగించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, ఆలయ సిబ్బంది, ఆలయ అధికారులు, భద్రతాధికారులు, వ్యాపారస్తులు, మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.
దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం, దశ హారతులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ఏర్పాటు- చేసిన వివిధ రకాల కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టు-కున్నాయి. ఆలయ ముందు భాగంలో ఉన్న పుష్కరిణి వద్ద భక్తుల సౌకర్యార్థం లక్ష దీపోత్సవ కార్యక్రమం,దశ హారతి నిర్వహించారు. ముందుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్‌ లవన్న అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పల్లకిపై ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష దీపోత్సవానికి అంకురార్పణ చేశారు. వేల సంఖ్యలో భక్తులు దీపాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. పౌర్ణమి వేడుకల్లో భాగంగా పుష్కరిణి వద్ద ఏర్పాటు- చేసిన వివిధ రకాల అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. స్వామి అమ్మవార్లకు నిర్వహించిన దశ హారతుల్లో ఓంకార హారతి, నాగ హారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహా హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి ఆకట్టుకున్నారు. ఈ దశహారతుల వల్ల దోషాలు తొలగి భక్తుల కోర్కెలు నెరవేరి, ఆరోగ్య పరిస్థితులు చక్క పడతాయని, యజ్ఞ ఫలాలతో పాటు- అ్టషశ్వర్యాలు సిద్ధిస్తాయని, వేదాలు పురాణాలు చెబుతున్నాయని ఆలయ వేద పండితులు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న, ఏఈఓ హరిదాసు. పర్యవేక్షకులు అయ్యన్న. శ్రీశైల ప్రభ ఎడిటర్‌ అనిల్‌, పీఆర్‌ఓ శ్రీనివాసులు. ఆలయ భద్రత అధికారి నరసింహారెడ్డి అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది భక్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement