తిరుమల :మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, కాఫి టేబుల్‌బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందచేశారు.
మిజోరం గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నానని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడు త ూ కరోనా కారణంగా రెండేళ్ళుగా శ్రీవారిని దర్శించు కోలేక పోయానని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించి, దేశం శరవేగంగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో మిజోరం గవర్నర్
Advertisement
తాజా వార్తలు
Advertisement