శ్రీరాముడి బాణం దెబ్బకు వాలి నేలమీద పడిపోయిన ప్పటికీ, ఇంద్రుడు ఇచ్చిన ఆయన మెడలోని బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం, కాంతి పో కుండా కాపాడాయి. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణం తో, నిర్మలమైన శరీరంతో వాలి మూడు రంగులతో ప్రకా శించాడు. శత్రువులను సంహరించే శక్తికల వాలికి, స్వర్గానికి పంపే శక్తికల రామబాణం ముక్తిని కలిగించింది. తాను నేలపడేసినవాడెలాంటి వాడో చూడాలనుకుని వాలిని సమీపించాడు శ్రీరాముడు. తనను సమీపించిన రామచంద్రుడిని చూసిన వాలి ధర్మంతో, వినయంతో కూడిన, కఠినమైన మాటలతో ఇలా అన్నాడు.
”రామా! నువ్వు రాజకుమారుడివి. శాస్త్రజ్ఞానం చక్కగా తెలి సినవాడివి. గొప్పవంశంలో పుట్టావు. కీర్తికి నువ్వు నెలవైనవాడివి. ఇలాంటివాడివై వుండి కూడా యుద్ధభూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో, చాటున వుండి నా రొమ్ముమీద కొట్టడంలో ఏం గొప్ప వుందో చెప్పు. రాముడు కరుణా జ్ఞానం కల వాడనీ, ప్రజల మేలు కోరేవాడనీ, దయాలక్ష్మికి స్థానమైనవాడనీ, ఉచితానుచితజ్ఞానం కలవాడనీ లోకులు నిన్ను పొగడుతుంటారు. తార నన్ను యుద్ధానికి పోవద్దని, సుగ్రీవుడికి సహాయంగా రాము డు వచ్చాడనీ, ఆయన నన్ను చంపుతాడనీ చెప్పినా వినకుండా వచ్చాను. రాజులకుండే ఉచితమైన సద్గుణాలు రాముడిలో లేకపో తాయా, నిరపరాధిని నన్నేల చంపుతాడని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను. నేను అంటున్న రాజగుణాల్లో ఒక్కటి కూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి, కోపగించి, గుణదోషాల విచారణ చేయకుండా, ఇతరులతో యుద్ధం చేసేవాడి ని ఎలా చంపాలి? అన్న ఆలోచన చేయక, ధర్మచింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుం డా, పిరికివాడిలాగా దూరంగా మాటువేసి, నీకే అపకారం చేయని నన్ను దండించావు కదా? నువ్వు మోసగాడివి అని తార తెలుసు కుంది కాని నేను తెలుసుకోలేకపోయాను”.
”రాముడు గొప్పవంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడై వుంటాడనీ, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హయ కార్యాలు ఎందుకు చేస్తాడనీ, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న ప్పుడు నా మీదకు ఎలా వస్తాడనీ, నన్నెందుకు చంపుతాడనీ, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడనీ భావించి, నీ ముఖం ఎన్న డూ చూడని కారణాన మోసపోయి ఈవిధంగా యుద్ధానికి వచ్చి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడికలవాడివి నువ్వు. మాయల మారివి. ఈ వాస్తవం తెలుసు కోలేక బుద్ధిహనత వల్ల ఇలా అయిపోయాను. నీకు నామీద కల#హ కారణం లేదు. అడవుల్లో వుండి మా ఇష్టప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయకూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీ కూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏంటి?”
”మేం అడవుల్లో తిరిగేవాళ్ళం. మీరు నగరాల్లో తిరిగేవారు. మేం పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం. మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు. నేనేమో మృగాన్ని. నువ్వో మనుష్యుడివి. నేను నీ సేవకుడిని. నువ్వు రాజైనా బుద్ధిలేనివాడివయ్యావు. రాజు లైనవారు ధర్మవశులై నడచుకోవాలి. మేమే ప్రభువులం, మేమెలా చేసినా కాదనేవారెవరు? అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలతచెంది, కామమే సర్వకాల సర్వా వస్తలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ, మంచి చెడు రాజుల మిశ్రమ నడవడి కలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో, చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావడం లేదు. నిన్ను శిష్టుడవని నమ్మలేం, దుష్టుడవని అన లేం. విల్లే ప్రధాన సాధనంగా తలచి, కలహానికి కాలుదువ్వుతూ, బలవంతుడినన్న గర్వంతో, ధర్మం విడిచి మర్యాద వదిలావు.”
”ధర్మం రక్షించడంలో నీకు విశ్వాసం లేదు. నీ విషయంలో నేను ఏరకమైన దోషం చేయలేదు. నిరపరాధిని అయిన నన్ను నీ బాణంతో చంపావు. ఈ నింద పోవడానికి సజ్జనుల సభలో నువ్వే మని సమాధానం చెప్తావు? నువ్వు రాజవంశంలో పుట్ట తగిన వాడి వికాదు. రామచంద్రా! ఏం మగవాడివయ్యా? నీ మగతనం నీ భార్యను అపహరించిన వాడిమీద చూపలేకపోయావు కాని, నీ జోలికి రాకుండా తటస్థుడిగా వున్న నామీద చూపావు కదా! నా కం టి ఎదురుగా నిలబడి నువ్వు నాతో యుద్ధం చేస్తే నిన్ను నిమి షంలో రుద్రభూమికి పంపేవాడిని కదా? నేనెంత శౌర్యం కలవాడినైనా చాటుగా వుండి విడిచిన నీ బాణం వల్ల చావాల్సి వచ్చింది కదా?”
”రామా! నీ కథ నాకు కొంచెమైనా చెప్పలేదు. చెప్పినట్లయితే, నువ్వే కారణాన సుగ్రీవుడు కోరిక తీర్చడానికి నన్ను చంపావో, ఆ కపటచిత్తుడైన రావణుడిని యుద్ధంలో కొట్టి, మెడలు వంచి పట్టు కుని, ఇక్కడికి ఈడ్చుకుంటూ తీసుకొచ్చేవాడినికదా? సీతను ఒక్క పూటలో తీసుకుని రానా? గోటితో పోయేదానికి గొడ్డలిని వెతికావ ు కదా? నా మరణానంతరం తండ్రి రాజ్యభాగంలో అర్హుడైన సుగ్రీ వుడు నన్ను ఆ రాజ్యం కొరకు చంపడం న్యాయమే. కాని, ఏ సం బంధంలేని నువ్వు వక్రమార్గంలో నన్ను చంపావు. ఇది అధర్మమై నది.” అని, నోరు ఎండుతుంటే, బాణం బాధతో శరీరమంతా మం డుతుంటే, బాధ సహంచలేక శ్రీరాముడిని చూస్తూ తేజో#హనుడై వాలి పడిపోయాడు. వాలి తనను దూషించిన వాక్యాలకు శ్రీరాము డు సమాధానం చెప్పాడు. దీనికొరకే వాలి వెంటనే మరణించే విధంగా బాణం వేయకుండా కొన ఊపిరి వుండేట్లు వేశాడు రాము డు. వాలి చనిపోయేట్లు బాణం వదులుతే రామచంద్రమూర్తి వాలి ని వధించడానికి కారణం తెలియక లోకులు ఆయన్ను పలురకాలు గా నిందించి వుండేవారు. రాముడు తగిన సమాధానం చెప్పినప్ప టికీ కొందరు ఇప్పటికీ ఆయన్ని నిందిస్తూనే వున్నారు కదా!
కఠినంగా, అవివేకంగా వాలి పలికిన మాటలకు, రాముడు ఇలా అన్నాడు. ”ఓయీ! ధర్మమని, అర్థమని పలికావు. సంతోషమే కాని ధర్మం ఏవిధంగా ఆచరిస్తే పురుషార్థమవుతుంది? ఎప్పుడు అది పురుషార్థం కాదు? అర్థం, కామం ధర్మంతో కూడి వుండేట్లు చేయాల్నా? ఈ విషయం ఆలోచించావా? పోనీ కుల సంప్రదా యం అంటావా? శాస్త్ర విషయంలో సందేహం వస్తే శిష్టాచారం కదా ప్రమాణం? అది ఎలా వుందో ఆలోచించావా? ఏ ఆలోచన చేయకుండా దూషిస్తే నీకు కలిగే లాభం ఏమిటి? పోనీ నువ్వు అడవి లో వుండేవాడివి కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుందంటా వా? తెలుసుకోకపోవడం నీ తప్పు. కుల గురువులనో, కులంలో పెద్దలనో, పండితులనో, ఆచార శుద్ధులనో అడిగావా?ఎందుకు అడ గలేదు? ఏమీ ఆలోచించకుండా నన్ను దూషిస్తే లాభం ఏంటి?”
”ఓయీ! కొండలతో, అడవులతో, తోటలతో, తోపులతో కూడి న ఈ భూమంతా ఇక్ష్వాకుల కాలం మొదలు ఇప్పటిదాకా మా వం శంలో పుట్టిన రాజులదని నీకు తెలుసా? ఈ కారణాన నువ్వు ఇక్ష్వా కు వంశంవారికి సామంతరాజువేకాని స్వతంత్ర ప్రభువువు కాదు. ఇలా వాళ్లు సార్వభౌములైనందువల్ల వారి రాజ్యంలోని సమస్త జనులను, మృగాలను, పక్షులను కూడా రక్షించడానికి, శిక్షించడా నికి వారికి అధికారం వుందని తెల్సుకో. ధర్మరక్షణ కొరకు తిరిగే మేం స్వధర్మాన్ని తప్పకుండా భూమ్మీదకల అధర్మాత్ములను భర తుడి ఆజ్ఞమేరకు దండిస్తాం. నువ్వు ధర్మాన్ని వదిలి కఠినమైన, నిం ద్యమైన కార్యం చేస్తూ అధర్మయుక్తమైన కామాన్నే ప్రధానంగా స్వీకరించి రాజధర్మాన్ని తప్పావు. ఇది నీకు తగునా? నిన్ను చంపిన కారణం చెప్తా విను. సజ్జనులు శ్లాఘించే సనాతన ధర్మాన్ని వదిలి నీ తమ్ముడు బతికుండగా అతడి భార్యను, నీ కోడలిలాంటి రుమను నువ్వు పాపమార్గంలో దుష్కామంతో పొందావు. నీ తమ్ముడి భా ర్యను చెరిచిన కారణాన నేను నిన్నీవిధంగా చంపాల్సి వచ్చింది.”
”నిన్ను దండించడానికి నేనెవర్ని అంటావేమో? చెప్తా విను. నేను క్షత్రియుడుగా పుట్టాను. సనాతన ధర్మాన్ని ‘క్షతమ్’ (చెడిపో కుండా) కాకుండా రక్షించేవాడే క్షత్రియుడు. కాబట్టి ధర్మరక్షణ అనే ది నాకు పుట్టుకతో వచ్చిన అధికారం. నేను సింహాసనం అధిష్టిం చి నా, అధిష్టించకున్నా ఈకార్యం నాకు తప్పదు. అది తప్పితే నేను నా స్వధర్మాన్ని తప్పినట్లే. ధర్మరక్షణ విషయంలో నాకెక్కువ అధికా రం వుంది. రాజకుమారుడినైన నేను ధర్మాన్ని లక్ష్యం చేయకుండా కామమే ప్రధానంగా చేసుకుని అతిపాపం చేస్తున్న నిన్ను ఎలా క్షమి స్తాను? ఎలా స#హస్తాను? ఇది సాధ్యమా? నా భార్యను రావణుడు ఎత్తుకుని పోవడం అధర్మమని కదా నువ్వు వాడిని కొట్టి తెస్తానన్నా వు. అలాగే పరుడి భార్యను, అదీ తమ్ముడి భార్యను, కోడ లులాంటి దానిని పూర్తిగా చెరిచిన నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు?”
”వాలీ! నా మనసులో లక్ష్మణుడు ఎలాగో, స్నేహం విషయం లో సుగ్రీవుడు అలాంటివాడే. నావల్ల సుగ్రీవుడికి కలిగే లాభం ఏం టి అంటావా? అతడి వల్ల నాకు కలిగే లాభం సీతను వెతకడం. ఆ పని అతడు చేయగలడు. మా స్నే#హంవల్ల నాక్కావలసింది నాదవు తుంది, అతడికి కావాల్సింది అతడికి దక్కుతుంది. ఇలాంటి స్నేహా న్ని ఏ కారణాన ఉపేక్ష చేసి నీతో స్నే#హం చేయమంటావు? ”నీ భార్య ను హరించిన వాలిని చంపుతానని, రాజ్యాన్ని, ఆయన భార్యను ఆయనకు అప్పగిస్తాన”ని సుగ్రీవుడికి మాట ఇచ్చాను. ఈ మేరకు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసాను. అలా నిండు మనస్సుతో ప్రమాణం చేసి మాట తప్పవచ్చా? కాబట్టి నా స్నేహితుడి కార్య సాధన కొరకు కూడా నిన్ను చంపాను. నువ్వు నిర్దోషివైనా, నా స్నేహ తుడుకి విరోధివైనందున నాకు కూడా విరోధివే. నువ్వు తనకు విరో ధివని సుగ్రీవుడు చెప్పినంత మాత్రానే నేను నమ్మి నిన్ను చంపలే దు. నా కళ్లముందర నా స్నే హితుడు, నా ఆశ్రితుడు, శరణాగతు డు వేరేవాళ్ల చేతిలో చంపబడడాన్ని చూస్తూ వుండడం ధర్మమా?”
ఇలా వాలికి అనేక రకాలుగా ధర్మశాస్త్ర వాక్యాలను చెప్పాడు శ్రీరాముడు. శ్రీరాముడి మాటలకు సమాధానపడి తనను క్షమించ మని కోరాడు వాలి. చెప్పినదంతా సత్యమనీ, జ్ఞానం లేకపోవడం తో తానేదేదో అన్నాననీ, క్షమించమనీ, ఆయన చేతిలో చనిపోయి ఉత్తమ లోకాలకు పోతున్నాననీ, సుగ్రీవుడి మీద ఏ ప్రేమ వుంచాడో ఆ ప్రేమ అంగదుడి మీద కూడా వుంచమనీ అన్నాడు.
వాలిని సమాధాన పర్చాడు రాముడు. ”నువ్వు పాపకార్యం చేశావు కాబట్టి నేను నిన్ను దండించాను. దానివల్ల నువ్వు పాపరహితుడివై ఈ దేహాన్ని విడిచి నిర్మలమైన దేవతాస్వరూపాన్ని ధర్మ మార్గంలో పొందేవాడివయ్యావు. దండించకపోతే నరకానికి పో యేవాడివి. నిన్ను చంపడం ఏమాత్రం అధర్మంకాదు” అన్నాడు.
”రామచంద్రా! మహానుభావా! నువ్వు ప్రయోగించిన బాణం నిప్పులాగా నన్ను కాలుస్తుంటే, ఆ బాధతో తెలివి#హనుడనై నిన్ను తిట్టాను. నన్ను క్షమించు” అన్నాడు వాలి. అలా అంటూనే కొన ఊపిరితో నేలకొరిగాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి
రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012