Saturday, November 23, 2024

శ్రీకృష్ణ హారతులే దీపావళి

ధర్మ సంస్థాపనకు ద్వాపర యుగము న శ్రీ కృష్ణ భగవానుడు అవతరించి ఎంతోమంది అసురు లను తుద ముట్టించాడు. శ్రీ కృష్ణలీలలు అనంతము, అద్భుతము. హిరణ్యాక్షుడు భూమిని తీసుకొని సముద్ర గర్భములోకి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము నెత్తి అతనిని సంహరించి భూమిని రక్షించాడు. ఆ నిషిద్ధ సంధ్యాకాల సమయ మున భూదేవికి బీజాంకురమైనాడు శ్రీ మహావిష్ణువు. తదుపరి భౌమాసురునిగా జన్మించాడు. అతడే నరకాసు రుడు. అసుర సంహారము తప్పదని గ్రహించిన భూదేవి మాతృప్రేమతో తన బిడ్డను రక్షించమని వేడుకొంది. అతని తల్లియే నాకు సహాయం చేయగా యుద్ధములో మరణిస్తాడని విష్ణువు తెలపగా, ఏ తల్లిd తన బిడ్డను చంపుకోదని సంతోషించి నరకాసురుని తీసుకొని వెడుతుంది. యుగయుగాన సురాసురులకు యుద్ధము పరిపాటి. అలాగే నరకాసురుడు శక్తివంతుడై దేవతల తల్లి అదితి చెవి కుండలాలను, వరుణుని సింహాసన ఛత్రమును తీసుకువెళ్ళాడు. మేరు పర్వత భాగమైన మణి పర్వతమును ఆక్రమించి దేవేంద్రునిపై దండెత్త డానికి సన్నాహాలు చెెసుకున్నాడు. ప్రాగ్జోతిష పురమును రాజధానిగా చేసుకొని, అభేధ్యమైన కోటను నిర్మించి దేవతలను హింసించసాగాడు. బాణాసురునితో స్నేహం చేసి అనేక వేలమంది రాజకన్యలను చెరపడతాడు. నరకా సురుని దుర్మార్గ చర్యలు మితిమీరిపోతాయి. చివరకు ఇంద్రుడు నిస్సహాయుడై శ్రీ కృష్ణ భగవానునికి మొర పెట్టుకుంటాడు. భగవానుడు యుద్ధాన్ని వీక్షించాలని ముచ్చటపడుతున్న సత్యభామను తీసుకొని గరుడ వాహనంపై నరకాసురుని పైకి దండెత్తడానికి బయలుదేరతాడు. ప్రాగ్జ్యోతిషపుర దుర్గము చుట్టూ శక్తి వలయాలు, విషవాయు యంత్రాలు కలిగి మురాసురుడు అనే రాక్షసుని పర్యవేక్షణలో ఉంది. ప్రళయ కాల గర్జన చేస్తున్న గరుడుని రెక్కల ధాటికి నరకాసురుని దుర్గము గజగజ వణికింది. శ్రీ కృష్ణ భగవానుని కౌమోదిక తన ప్రచండమైన గదాఘాతాలతో శక్తి వలయాలను, విష వాయు యంత్రాలను పగుల గొట్టి పంచ ముఖుడైన మురాసురుని ఎదురుగా నిలిచింది. అప్పుడు మురాసురు డు తన త్రిశూలాన్ని గరుడు ని పైకి విసరగా కృష్ణ భగవానుడు తన శరీరములతో తుత్తునియలు చెెశాడు. మురాసురుని, అతని ఏడుగురు కుమారులను సుదర్శన చక్రముతో యమపురికి పంపాడు. ఈ వార్త విన్న నరకుడు తన గజసేనతో కోట బయటకు వచ్చి ఆకాశంలో గరుడ వాహనంపైనున్న శ్రీకృష్ణుని, సత్యభామను చూసి శతఘ్ని అనే ప్రత్యేక ఆయుధాన్ని వారిపై ప్రయోగిస్తాడు. భగవానుడు దాన్ని ఖండిస్తాడు. నరకుని సేనలు విజృంభించి బాణాలతో యుద్ధం చేస్తా రు. గరుత్మంతుడు తన కాలిగోళ్ళతో ఏనుగులను చీల్చి చెండాడ తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుని ముద్దుల భార్య, భూదేవి స్వరూ పమైన సత్యభామ తాను యుద్ధం చేస్తానని ముచ్చట పడుతుంది. భర్తను అడుగుతుంది. సతి మాట కాదన లేక ధనుర్భాణాలను ఆమె చేతికి అందిస్తాడు కృష్ణుడు. సుకుమారమైన ఆమె కరములు అత్యం త వేగంగా బాణాలను ప్రయోగించాయి. ఆమె జడ అసురుల పాలిట కాల సర్పమై కనిపిస్తుంది. మధ్యమధ్యలో క్రీగంటి చూపులతో తన పతిని చూస్తూ అవలీలగా నరకుని సైన్యాన్ని తన శర పరంపరతో నాశనం చేస్తుంది సత్యభామ. నరకాసురుడు ఒక్కడే భూమిపై నిలిచివుండగా చివరి ప్రయ త్నంగా అతడు ఒక త్రిశూలాన్ని సత్యభామా కృష్ణులపై ప్రయోగి స్తాడు. ఆ ఆయుధం తమను తాకకుండానే తన సుదర్శన చక్రంతో శ్రీ కృష్ణుడు నరకుని శిరస్సును ఖండిస్తాడు. యుద్ధ రంగంపై పడిన నరకాసురుని దేహాన్ని చూసి రాక్షసులు గోడున విలపిస్తారు. దేవతలు, సత్పురుషులు, బాధితులు అత్యంత సంతోషంతో శ్రీ కృష్ణ భగవానుని, సత్యభామను కీర్తిస్తారు. నరకుని అకృత్యాలతో చీకట్లను క్రమ్మిన వారి జీవితాలు వెలు గులతో నింపిన సత్యభామ కృష్ణులకు దీపాలతో హారతులిచ్చారు. ఆ దీపముల వరుసలు భూ మండలమంతా వెలుగు నింపు తాయి. ఆ సమయంలో భూదేవి శ్రీ కృష్ణునికి వైజయంతి మాలను సమర్పించింది. అదితి కర్ణ కుండలాలను కూడా ఇచ్చింది. వరుణుని ఛత్రమును కూడా సభక్తి పూర్వకంగా వారికి అర్పించి స్తుతించినది. సృష్టి, స్థితి, లయములకు అధిపతి అయిన కృష్ణుని కీర్తిస్తూ నరకాసురుని పుత్రుడైన భగవదత్తుని కరుణించమని వేడుకొం టుంది. బాలుడైన భగవదత్తునికి అభయమొసగిన సత్యభామా శ్రీ కృష్ణులు నరకుని కోటలో ప్రవేశించారు. బందీలుగానున్న పదహారు వేల ఒక వందమంది రాజకుమార్తెలను విడిపించారు. వారందరూ తొలిచూపులోనే అవ్యాజమైన ప్రేమను కృష్ణ భగవానునిపై చూపిం చి, తమకు ఆయనే భర్తగా కావాలని చెబుతారు. విశుద్ధ భక్తి భావన ను చూపించిన లక్ష్మీదేవి విస్తృత అంశలైన రాజకుమార్తెలందరిని తన హృదయ పత్నులుగా స్వీకరిస్తుంది. వారిని ప్రత్యేకమైన వసతు లతో ద్వారకా నగరంలో ఉంచుతుంది. ఏక కాలంలో అందరినీ వివాహమాడి అందరినీ ఆధ్యాత్మికానందంలో ఓలలాడిస్తాడు భగ వానుడు. తరువాత గరుడా రూఢులై సత్యభామా శ్రీకృష్ణులు స్వర్గ లోక రాజధాని అమరావతికి వెళతారు. శచీ సహితుడైన ఇంద్రుడు వారికి ఘనంగా స్వాగతం పలుకు తాడు. కర్ణ కుండలాలు, ఛత్రము ఇంద్రునికి అప్పగిస్తాడు కృష్ణుడు. అమరావతి నుండి తిరిగి వచ్చే సమయంలో గతంలో సత్యభామకు ఇచ్చిన మాటప్రకారం ఒక పారిజాత వృక్షాన్ని తీసుకుని, గరుడు నిపై పెడతాడు కృష్ణుడు. ఆ తరువాత అక్కడ నుంచి బయలుదేర తారు. ఒకసారి నారద మహర్షి రుక్మిణీదేవికి అమరావతి నుండి ఒక పారిజాత పుష్పము తెచ్చి ఇచ్చాడు. అది ద్వారక మొత్తం తన సుగంధంతో నింపి వేసింది. దానిని చూసి అలిగిన సత్యభామకు మాట ఇచ్చాడు భగవానుడు. కానీ భూలోకమునకు పారిజాతము పంపుట ఇష్టము లేని దేవతలు వారిని ప్రతిఘటించగా ఇంద్రుని చర్యకు ఆశ్చర్యపడిన భగవానుడు వారిని ప్రతిఘటనను రూపు మాపి క్షమిస్తాడు. ఈ దీపావళి వేళ… వెలిగించే దీపాలు ప్రతి ఒక్కరిలో మానసిక చీకట్లను పారద్రోలి, ప్రతి ఇంటా సుఖ సంతోషా లను నింపాలని ఆ శ్రీ కృష్ణ భగవా నుని భక్తితో కోరుకుందాం.
”కృష్ణం వందే జగద్గురుం”

– వారణాసి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement