Friday, November 22, 2024

శ్రీకూర్మంలో ఘనంగా డోలోత్సవం

శ్రీకాకుళం, ప్రభన్యూస్‌: గార మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి డోలోత్సవం శుక్రవారం కన్నుల వైభవంగా జరిగింది… ఈ డోలోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు, పుష్కరిణి స్నానాలు చేశారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు .. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు సముద్ర స్నానానికి వచ్చిన భక్తు లు చనిపోయిన వారి పెద్దలకు పిండాలు కోనేరులో వదిలారు . ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీకూర్మం డోలోత్సాహం జరుపుకొంటారు.
అరసవల్లిలో…
ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత అయినటు-వంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో డోలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకు లు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా శ్రీ ఉషా, పద్మిని, ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వెండి సప్తాశ్వ వాహనంలో తిరువీధి మహోత్సవం నిర్వహించి, అనంతరం చిన్న తోటలో స్వామి వారికి విశేష అర్చనలు,బుక్కా భర్గుండతో,సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మధ్యాహ్న సమయంలో తిరిగి ఉత్సవమూర్తులను వేదమంత్రాలు, మంగళధ్వనులు మధ్య ఆలయంలోకి తిరిగి తీసుకుని వచ్చి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు భవాని , మండల మన్మధరావు, ఈ ఒ హరి సూర్య ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement