శ్రీకృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి !?
అవును! కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు. యుద్ధంలో మరణం తో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య. కర్ణుడు చేసిన దాన ధర్మాలు అతడిని మృత్యువు దరిచేర కుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడి వద్ద కు వెళ్ళి ఒక కోరిక కోరాడు. ”కర్ణా! నువ్వు దానం చేయగా పొం దిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయ వా” అని కృష్ణుడు అడిగాడు. కర్ణుడు దానం చేసేసాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టు-కుని ”నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు” అన్నాడు. అందుకు కర్ణుడు ”నాకు ఇంకో జన్మ వద్దు. ఒకవేళ జన్మ ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటు-వంటి హృదయాన్ని నాకు ఇవ్వు” అన్నాడు.
ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి. ”ఇంత మంచివాడి వేంటయ్యా కర్ణా నువ్వు?” అని గట్టిగా కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు. మనం మంచి మనసున్న వార మైతే చాలు! ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుం టాడు. వందే కృష్ణ మ్ జగద్గురుమ్.
– డా. చదలవాడ హరిబాబు
9849500354
శ్రీకష్ణుడి కంట కన్నీరు!
Advertisement
తాజా వార్తలు
Advertisement