Tuesday, November 26, 2024

శైలపుత్రి అలంకరణలో భ్రమరాంబ దేవి

బృంగి వాహనంపై భక్తులకు
దర్శనమిచ్చిన ఆది దంపతులు

శ్రీశైలం, కర్నూలు ప్రభ న్యూస్‌: శీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నవ దుర్గ అలం కరణలో భాగంగా భ్రమరాంబ దేవి అమ్మవారిని శైలపుత్రీ దేవిగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న దంపతులు ఉదయం 8. 30కు ఆలయ ప్రవేశం చేశారు. ఉత్సవ సంకల్పం, గణపతి పూజ, కంకణ పూజ, కంకణ హారతి, ఋతిగ్వరణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శైలపుత్రి అలంకరణలో అమ్మవారు, స్వామి అమ్మవార్లకు బృంగి వాహనసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కోలాహలంగా ముందుకు సాగింది.
ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను భక్తులు కనులారా దర్శించు కున్నరు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న ఏఈవోలు హరిదాసు ఫణింద్ర ప్రసాద్‌ ఉ. మల్లయ్య పర్యవేక్షకులు అయ్యన్న పిఆర్‌ఓ శ్రీనివాసులు శ్రీశైల ప్రభ ఎడిటర్‌ అనిల్‌, దేవస్థానం భద్రతాధికారి నరసింహారెడ్డి అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు
దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు
శ్రీశైలంలో లోకకళ్యాణం కోసం దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శైలానికి దత్తాత్రేయస్వామి వారికి అవినాభావ సంబంధం ఉందని, ఆలయ ప్రాంగణంలో త్రిఫల వృక్షం క్రింద తపస్సు చేశారని, అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరొచ్చిందని అలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement