Saturday, November 23, 2024

శుద్ధానంద చైతన్యమూర్తి సాయి!

శ్రీసాయి అవతారము విశిష్టమైనది. అద్భుతమైనది. ఆయన నడయాడిన షిరిడీలో వారి సాంగత్యములో అనేకమంది భక్తులు ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందారు. సాయిబాబా శుద్ధానంద చైతన్యమూర్తులు. ఎవరు సాయి పాదాలను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగుతుంది. సన్యాసులు, సాధకులు మోక్షానికై పాటుపడే అనేక మంది సాయిబాబా వద్దకు వెళ్లేవారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుతూ, నవ్వుతూ అల్లా మాలిక్‌ అని యెల్లప్పుడు పలుకుతూ వుండేవారు. వారికి వివాదములుగాని, చర్చలుగాని ఇష్టం వుండవు. అప్పుడప్పుడు కోపించినప్పటికి వారెల్లప్పుడు నెమ్మదిగానే వుండేవారు. ఆయన తన శరీరాన్ని పూర్తిగా స్వాధీనంలో ఉంచుకొనేవారు. ఎల్లప్పుడు వేదాంతాన్ని బోధించే వారు. ఆఖరువరకు బాబా ఎవరో ఎవరికి తెలియనేలేదు. అందరినీ ఒకేలా ఆదరించే వారు. రాజులను, భిక్షుకులను కూడా సమానంగా చూసేవారు. అందరి అంతరంగంలో వున్న రహస్యాలన్నీ బాబాకు తెలిసిపోయేవి. వాటిని బాబా పైకి చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయేవారు. వారు సర్వజులైనప్పటికీ ఏమీ తెలియని వారివలె నటించేవారు. సన్మానములంటే బాబాకు ఇష్టం వుండదు.
సాయి మానవ శరీరంతో భూమిపై నడయాడినప్పటికీ వారు చేసే పనులను బట్టి ఆయన సాక్షాత్తు భగవంతుడని కొలిచే వారు. షిరిడీలో వెలసిన భగవం తుడని పూజించేవారు. బాబాను దర్శించిన ప్రజలు అనేక శుభా లను పొందేవారు. కొందరు ఆరోగ్యవంతులు అయేవారు. అనేకమందికి వారు కోరిన కోర్కె లు నెరవేరేవి. కంటిచూపు పోయి నవారికి చూపును దెప్పించే వారు. కుంటివారికి కాళ్ళు వచ్చేవి. సాయిబాబా గొప్పతనము అంతులేనిది. అపారమయినది. దాన్ని ఎవరూ కనుగొన లేకపోయారు. వారి కీర్తి షిరిడీలోనే కాదు చాలా దూరం వ్యాపించింది. అన్ని దేశాల భక్తులు షిరిడీకి వచ్చేవారు. బాబా ఎక్కువ సమయం ధునివద్దనే ధ్యానంలో కూర్చుని వుండేవారు.
బాబా ఫకీరులా నటించినప్పటికి ఎప్పుడూ ఆత్మానుసంధానమందే నిమగ్నులయి వుండేవారు. దైవభక్తిగల వారిని, పవిత్రులను ఎప్పుడూ ప్రేమించేవారు. సుఖాలకు పొంగి పోయేవారు కాదు. కష్టాలకు కుంగిపోయేవారు కాదు. అందరి కష్టాలను తీర్చి సుఖ జీవితాన్ని ప్రసాదించిన బాబా తాను మాత్రం ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకునేవారు.
శరీరమే తామని భ్రమించేవారికి జీవితం పట్ల అన్ని వ్యామోహాలు వుంటాయి. మృత్యు వుపై విషయం సాధించిన వారే మహాత్ములు. సాయిబాబా సశరీరులుగా వున్నప్పడే మాన వుల్లా శరీర పరిమితులతో ఎన్నడూ లేరు. బాబా షిరిడీకి వచ్చిన తొలి రోజులలో తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు స్నానం కూడా చేసేవారు కాదు. రోజుల తరబడి ఒకే వస్త్రంతో వుండేవారు. అన్ని రూపాలలో వున్న పరమాత్మగా జీవిం చిన మన కాలపు మానవుడు సాయిబాబా. ఆయన గురించి షిరిడీ వెలుపల ప్రచారం విస్తరిం చిన కొద్దీ దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అందరికీ బాబా ఒక్కటే చెప్పేవారు. మతంతో సంబంధంలేకుండా సాటివారిపై మమకారం చూపే స్వభావాన్ని అలవరచుకోవా లని, మనుషులుగా మెలగడంలో చూపాల్సిన ఔన్నత్యాన్ని ప్రబోధించేవారు సాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement