మనుషులు తమ జీవితాలలో ఎంతో మోసాలను చూసారు. అసత్యమైన విషయాలను ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువైన కారణంగా భావాలు సమ్తామైపోయాయి. అందుకే కొంతమంది ఐక్యత అనుభావాన్ని మర్చిపోయి ప్రపంచాన్నే తిరస్కరిస్తూ ఉంటారు. ఏది ఏమైనా, ఆత్మ పరమాత్మ నుండి పొందడాన్ని ప్రారంభించినప్పుడు మనసు తెరుచుకుంటుంది. కనుక భగవంతుని ప్రేమను తీసుకుని శుద్ధమైన భావాలేమిటో అనుభవం చేద్దాం. ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉండి స్వయంపై విశ్వాసం కలిగి ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి మన భావాలలో పవిత్రత ఉన్నప్పుడు ప్రమేను అనుభవం చెయ్యగలము. ఆ ప్రేమను భగవంతుడి నుండి తీసుకుని అందరికీ పంచుదాము. ఇతరుల పట్ల ఎంతో శుద్ధమైన భావాలు కలిగి ఉండటం ద్వారా అవి వారి వద్దకు చేరుకుంటాయి. మనలోని శుద్ధ భావాల శక్తితో ఒకరికొకరం సహాయం చేసుకోగలము.
నా అంతరంగంలో నాకున్న భావన : నేను భగవంతుడి నుండి ఎంతో పొందినట్లుగా, భగవంతుని పిల్లలందరూ వారి తండ్రి నుండి ఇదే విధంగా పొందుగాక.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి