Friday, November 22, 2024

శివార్చనా విధి విధానాలు

సూత మహానుభావుడు మునుల కోరికపై శివార్చన విధి విధానా లను మనోజ్ఞంగా వివరించాడు.
శివార్చన వలన అన్ని పనులూ నెర వేరుతాయి. అన్నివిధాల దరిద్రాలు రోగ పీడలూ నశించిపోతాయి. శత్రు భయా లుండవు. చతుర్విధ పాపాలు నశిస్తాయి. సర్గ సుఖాలు కల్గి ఆనందం లభిస్తుంది. ముక్తి లభిస్తుంది. శివుని ఆశ్రయించిన వారు సత్సంతానమును పొంది సర్వ కార్యార్థ సాధకులౌతారు.
శివార్చన చేయదలచుకున్నవారు ప్రాత: కాల బ్రాహ్మీముహుర్తంలో నిద్ర లేచి, గురు స్మరణ చేసుకోవాలి. మనసారా శివుణ్ణి స్మరించాలి. పక్కమీద నుండి లేచి దంత ధావనం చేసి, దేశ కాలానుగుణంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఆచమనం చేసి, ధౌత ధరించి ఏకాంత ప్రదేశ మందాసీనుడై న్యాసపూర్వకంగా శివార్చనకు ముందుగా వినాయకుని అర్చించాలి. ద్వార పాలకులను, అష్ట దిక్పాలకులను కూడా అర్చించి- పీఠ పూజ చేయాలి. దానిపై అష్టదళ పద్మం వేసి, కూర్చొని, పరమశివుని ఆసీనుని చేయాలి. మూడుసార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కోవాలి.
పంచవక్త్రం దశ భుజం- శుద్ద స్పటిక సన్నిభం సర్వా భరణ సంయుక్తం – వ్యాఘ్ర చర్మోత్తరీయకం అంటూ శివుని ధ్యానించా లి. శివునికి స్నానం చేయించి, పంచామృ తాలతో అభిషేకం చేసి, మాల మంత్రంతో న్యాసం చెప్పి, ప్రణవంతో అంగన్యాస, కర న్యాసములు ఆచరించాలి. అర్ఘ్య పాద్యము లు ఆచమనాలతో పాత్రలను వుంచి, రెం డు కొత్త కలశాలను స్థాపించి వాటిని దర్భ లతో ఆచ్ఛాదించాలి. తొమ్మిది కలశముల నుంచి వాటితో మంచినీరు నింపాలి.
వట్టివేరు, శ్రీ గంధం పాద్య పాత్ర లోనూ జాజికాయ పచ్చ కర్పూరం, మర్రి ఊడలు, తమాల పత్రం చూర్ణమును ఆచమన పాత్రలోను, తక్కిన వాటిలో శ్రీ గంధం చూర్ణం వేయాలి. శివ సన్నిధానం లో దీప ధూప సుగంధ ద్రవ్యాలు అమ ర్చి- శివునికి ఓం కారంతో ఆసనం కల్పిం చి, సోమ, సూర్యాగ్నులు- ధర్మాదులు, ఆ పీీఠానికి ముందు భావించాలి. పిదప నందికేశ్వరుని పూజించాలి.
”సద్యో జాతం ప్రపద్యామి- సద్యో జాతా యవైనమో నమ: ” అను వేద మంత్రముతో ఆ వాహన చెప్పి, వామ దేవ మంత్రోక్తము గా పీఠమునందు పవసింప జేసి, రుద్ర- గాయత్రీ జపంతో, సాన్నిధ్యమును పొం దాలి. ఈశాన్య మంత్రంతో పాద్యం, ఆచ మనీయం అర్ఘ్యం సమర్పించాలి. పిదప శ్రీ గంథం కలిపిన నీటితో, పంచగవ్యము లతో, పవిత్ర భాండములందు వస్త్ర పూత ములు గావించబడిన మంచినీటితో రుద్రా ధ్యాయాలను పఠిస్తూ అభిషేకం చేయాలి.
శివునికి అభిషేకమంటే ఇష్టం. ”అభి షేక ప్రియోశ్శివ:” అని శాస్త్రం. శుద్ది చేయ బడిన వైదిక భస్మమును అలంకరించాలి. గంధాక్షతలు అర్పించాలి. కుశలు- పూలు అపూర్వ పుష్పాలైన ఉత్తరేణులు, జాజిపూ లు చంపకములు, పాటల పుష్పములు- తెల్లగన్నేరులు- మల్లెలు- కమలములు, కలువలు వంటి వాటిని సమర్పించాలి.
అభిషేక సమయంలో రుద్ర సూక్తం- మృత్యుంజయస్తవం మంత్రం స్మరిస్తూ వుంటే సర్వారిష్టాలు శాంతినిస్తాయి. పిద ప మారేడు దళాలు- ధూపం – అవసర నైవేద్యం తాంబూలం దక్షిణ పండ్లు సమ ర్పించాలి. నీరాజనం ఇవ్వాలి. మంత్ర పుష్ఫము, ఆత్మనమస్కారం చేయాలి. శైవసంప్రదాయం ప్రకారంగా మహా మం త్రాలు పఠిస్తూ, అర్ఘ్యం ఇచ్చి, శివలింగం యొక్క పాదముల చెంత పూలు పెట్టి, కృ తాజలియై నిలిచి ”ఓం శంకరా! తెలిసి గాని, తెలియక గానీ, నాచే చేయబడిన జల పూజాదిక విధులన్నియు నీ వలన సఫల ములగుగాక అని ప్రార్థించి చేతిలో నున్న పూలను స్వామికి అర్పించి పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి. శివ పూజ ఆరాధ పరమ పవిత్రం.
ఓం నమ శ్శివాయ
– పివి సీతారామ మూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement