‘తస్య యా పరమా శక్తి: జ్యోత్స్నే వహిమ దీధితే:
సర్వావస్థాగతా దేవీ స్వాత్మభూతానపాయినీ
అహన్తా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతనీ’
అని ‘లక్ష్మీతంత్రము’లో చెప్పబడింది. మహాలక్ష్మి ఇంద్రునికి చెప్పిన మాట ఇది. ఆ శ్రీమన్నారాయణునికి నేను చంద్రునికి వెన్నెల వలె పరమశక్తిని. సకలావస్థలలో నేను స్వాత్మాభూతను అనగా విడిచి ఉండనిదానను.
నేను అహంతాశక్తిని. నెెను సనాతనశక్తిని. ఈ శక్తి రెండవ పేరే నారాయణి.
‘నిత్యనిర్దోషనిస్సీమ కల్యాణగుణాశాలినీ
అహం నారాయణీ నామ సాసత్తా వైష్ణవీమతా’
ఇలా నారాయణుని శక్తియే నారాయణిగాను, వైష్ణవిగాను, మహాలక్ష్మిగాను వ్యవహరించ బడింది. ఈ మహాల క్ష్మి స్వయంగా పరమాత్మకు విశేషణమై, ధర్మమై, అనేక గుణములు, ధర్మములు, శక్తి శక్తిమలు కలదని గ్రహించాలి. విష్ణుశక్తిగా చెప్పబడిన అహంతా శక్తియే ఆదిలక్ష్మి. అందులోనివే ఆ పరాశక్తి, విద్యాశక్తి అని స్పష్టపరచబడింది.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి