Friday, November 22, 2024

శక్తి – భక్త్తి -ముక్తి – తరింప చేసే తల్లి (ఆడియోతో..)

1.ముగ్గురమ్మలు……మూడు శక్తులు
త్రిమూర్తుల శక్తిని ఇతిహాసపురాణాలు మూడు విధాలుగా అభివర్ణిస్తున్నాయి. వాటి ఆధారంగా శ్రీ మహావిష్ణువుకు ఉండే శక్తిని మహాలక్ష్మిగాను, శంకరునిలోని శక్తిని మహాకాళిగాను, బ్రహ్మశక్తిని మహాసరస్వతిగాను వ్యవహరిస్తున్నాము. శ్రీమహా విష్ణువు రక్షించువాడు…రుద్రుడు సంహరించువాడు…బ్రహ్మ సృష్టించువాడు.

పరమాత్మ ఎలాగైతే ఒక్కడో అలాగే పర మాత్మలో ఉండే శక్తి కూడా ఒక్కటే. గుణాలను బట్టి పనులను బట్టి మాత్రమే పే ర్లు మారుతుంటాయి. వారే ముగ్గురమ్మలు.

శ్రీవిష్ణు పురాణములో ….
‘విష్ణుశక్తి:పరాప్రోక్తా క్షేత్రజ్ఞాఖ్యాతథాపరా
అవిద్యాకర్మ సంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే”అని చెప్పబడింది. ఈ మూడు శక్తులలో విశిష్టమైనది విష్ణుశక్తియే. విష్ణుశక్తి మూడు విధాలుగా ఉంటుంది.
1. విష్ణుశక్తి, 2. క్షేత్రజ్ఞశక్తి, 3.అవిద్యాకర్మశక్తి. వీటిలోని అవిద్యాకర్మశక్తి సంసారములోని మానవులను ఆవరించడం వల్ల సంసార తాపాలు, కష్టాలు కలుగుతుంటాయి. మానవపశుపక్షిక్రిమికీటకాది వివిధ జన్మములకు, వాటి వలన కలిగే కష్టాలకు కూడా ఈ అవిద్యాకర్మశక్తే కారణం. అవిద్యాకర్మశక్తి వల్ల పుట్టుక, క్షేత్రజ్ఞశక్తి ద్వారా కష్టాల అనుభవము కలుగుతుం టుంది.

‘యయా క్షేత్రజ్ఞశక్తిస్సా వేష్టితా నృప సర్వగా
సంసార తాపాన్‌ అఖిలాన్‌ అవాప్నోత్యతి సంతతాన్‌’….

- Advertisement -

ఈ క్షేత్రజ్ఞ శక్తి సంసారతాపాలు అనుభవించేలా చేస్తుంది. ఇక విష్ణుశక్తి అనే మొదటి శక్తి అన్ని తాపాలనూ తొలగిస్తుంది.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement