Saturday, November 23, 2024

వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే..

  • శ్రీవారి దర్శనానికి రెండు డోసుల సర్టిఫికెట్‌ ఉండాలి
  • లేదంటే తాజా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి
  • ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు
  • ఆర్టీసీ బస్సులో శ్రీవారి దర్శన టిక్కెట్లు

తిరుమల, ప్రభన్యూస్‌:కరోనా నేపథ్యంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌తో వచ్చిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం లభిస్తుందని, ఆ ధ్రువపత్రం లేనిపక్షంలో దర్శనానికి వచ్చే తేదీకి మూడు రోజుల ముందు కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టు వచ్చినవారు ఆ ధ్రువపత్రాన్ని చూపిస్తేనే దర్శనానికి అవకాశం కల్పిస్తారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని భక్తుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని, 26నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు గుమికూడుతుండడంతో కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అక్టోబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 గురువారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వెల్లడించారు.
ఆర్టీసీ బస్సుల్లో శ్రీవారి దర్శన టికెట్లు
భక్తులకు శ్రీవారిని మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ బస్సులలో 300 రూపాయల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. లాంగ్‌ సర్వీస్‌ బస్సుల్లో ఆన్‌లైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్‌ను కేటాయిం చనున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూల్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. ప్రతిరోజూ ఆర్టీసికి టిటిడి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను వెయ్యి కేటాయించింది. ఈ టికెట్లతో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 4 గంటల వరకు దర్శించుకునే అవకా శముంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ తిరుపతికి 650 సర్వీసులు నడుస్తు న్నాయి. ప్రయాణికులు తిరుమల బస్‌ స్టేషన్‌ చేరుకున్న వెంటనే అక్కడున్న ఆర్టీసీ సూపర్‌వైజర్లు వారికి టికెట్లు ఇచ్చి, దర్శనానికి కావాల్సిన సహాయం అందజేస్తా రు. అయితే గతంలో ఆర్టీసీ బస్సుల్లో శ్రీవారి 300 రూపాయల టికెట్ల వ్యవహా రంపై కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు టీటీడీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా, పక్కాగా బస్సుల్లో ప్రయాణించేవారు మాత్రమే శ్రీవారి దర్శన టికెట్లు పొందేలా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement