Friday, November 22, 2024

వైభవంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి జన్మదిన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరి గాయి. నాగులచవితి పర్వదినాన జన్మించిన స్వామి ఏటా అదే రోజున తన పుట్టినరోజు జరుపుకోడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపధ్యంలోనే సోమవారం విశాఖ శారదాపీఠం ప్రాంగ ణం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సందడిగా మారింది. పీఠం భక్తులు, స్వామీజీ శి ష్యులు స్వరూపానందేంద్ర జన్మ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు.
అవహంతి హోమం, ఆయుష్‌ హోమం, పాద పూజ, బీక్షవందనంతో పీఠం ప్రాంగణమంతా వేద ఘోషతో ప్రతిధ్వనించింది . తెల్లవారు జామునే పీఠాధిపతులు స్వరూపానందేంద్రకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి కూపి స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా దండ తర్పణం చేపట్టారు. అనంతరం పీఠం ప్రాంగణం లోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించిన స్వరూపానందేంద్ర శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేశారు. షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి విగ్రహానికి పంచామృ తాలతో అభిషేకం నిర్వహించారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి గురుదేవులకు భక్తిపూర్వకంగా పాద పూజ చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ వేదాలు మానవాళికి జ్ఞాన మార్గం, ధర్మ మార్గాలను సూచిస్తున్నాయని చెప్పా రు. ధర్మాన్ని ఆచరించటం ఎలాగో గురుదేవుల ద్వారానే నేర్చుకోవాలన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం గొప్ప ఆధ్యా త్మిక కేంద్రంగా విరాజిల్లుతుండటానికి పీఠాధిపతుల ధర్మ మార్గమే అందుకు కారణమన్నారు. ఆదిశంకరాచార్యుని అడుగుజాడల్లో శుద్ధశాంకర తత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ శంకరాచార్య విరచితాలను గ్రంధ రూపంలో ముద్రిస్తున్న ఏ-కై-క పీఠం తమదేనని స్పష్టం చేసా రు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమా ల వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠాన్ని అభివర్ణించారు. స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున వేద సభ నిర్వహించారు. నాలుగు వేదాలు, వివిధ శాఖలకు చెందిన పండితులు ఈ సభకు హాజర య్యారు. స్వామీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిరుపేద మహిళలకు పెద్ద ఎత్తున చీరలను పంపిణీ చేశారు. అంతకుముందు శ్రీవారి ప్రసాదాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఠాధిపతుల చేతికి అందించారు. పీఠాధిపతుల జన్మదినోత్సవం సందర్భంగా పూరీ జగ న్నాధ స్వామి ఆలయం నుంచి ప్రసాదాన్ని పంపారు. అలాగే అరసవిల్లి, సింహాచలం, శ్రీశైలం, బెజవాడ కనక దుర్గ, ద్వారకా తిరుమల, కాళహస్తి, కాణిపాకం దేవస్థాన ములకు చెందిన ఈవోలు, ఇతర అధికారులు పీఠాధిప తుల చేతికి ప్రసాదాన్ని అందజేసారు.
ప్రముఖులకు పీఠాధిపతుల ఆశీస్సులు
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి జన్మ దినోత్సవం సందర్భంగా అనేకమంది ప్రముఖులు పీఠాన్ని సందర్శించారు. వీరంతా స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందు కున్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆవంతి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రంగనాధరాజు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పార్లమెంటు- సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్‌, ఎ మ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, అదీప్‌ రాజ్‌, శెట్టి పాల్గుణ, కారుమూరి నాగేశ్వరరావు, వెంకట చిన్న, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణష్‌కుమార్‌ స్వామీజీ ఆశీస్సులు అందుకున్న వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement