తిరుమల, ప్రభన్యూస్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజా రోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయ
ప్పస్వామివారి సమక్షంలో వేద మం త్రోచ్ఛారణ మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై ధ్వజ పటాన్ని ఎగుర వేశారు. ధ్వజా రోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు బంగారు తిరుచ్చి పై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రతాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఈఓ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, మల్లిdశ్వరి, మారుతి ప్రసాద్, మూరంశెట్టి రాములు, శంకర్, సీవీఎస్‌ఓ గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటి ఈఓ రమేష్‌బాబు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ధ్వజారోహణం
Advertisement
తాజా వార్తలు
Advertisement