Saturday, November 23, 2024

వేద విద్యకు ఊపిరి విద్యారణ్య స్వామి

”సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం”…
”అవిద్యారణ్య కాంతారే భ్రమతం ప్రాణినాం సదా, విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుమా శ్రయే”…
”విద్యా విద్యావివేకీన పారం, సంసార వారిధే: ప్రాపయత్య నిశం భక్తాన్‌ తం విద్యారణ్యమాశ్రయే…
ఆదిశంకరుని అనంతరం అంతటి వారిగా పేరెన్నికగన్నారు విద్యారణ్యస్వామి. విఖ్యాత పురుషుడు, మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శ్రౌత స్మార్త క్రియా పరుడు, వేదాంత శాస్త్ర ఆది రచయిత, శతాధిక గ్రంథకర్త, విశేషించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్య స్థాపకుడు, మహామంత్రి, హందూ మతోద్ధారకుడు, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగగిరి పీఠాధిపతిగా పలు విధ ప్రత్యేకతలతో, జగత్‌ ప్రసిద్ధి పొందారు విద్యారణ్యస్వామి. 1267లో వైశాఖ శుక్ల సప్తమి నాడు జన్మించి, 1331లో సన్యాసం స్వీకరించి, శృంగేరి పీఠాధిపత్యం వ#హంచారు. 1386లో శుద్ధ త్రయోదశి నాడు సిద్ధిపొందారు విద్యారణ్యులు. విద్యారణ్య స్థాపిత పుష్పగిరి తదితర స్థలాలలో, జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు, ఆరాధనోత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు.
ఉత్తర #హందూ దేశమంతా మహమ్మదీయుల వశమై, అన్యమతస్తుల ఆధిపత్యం అధికమైన పరిస్థితులలో, శంకరుని తర్వాత అంతటి వాడైన, ప్రాధాన్యత కలిగిన విద్యారణ్యుడు విద్యానగరం (విజయనగర) సామ్రాజ్య నిర్మాత సామ్రాజ్య రక్షకులు అయినారు. భరత జాతిని జాగృతపరిచేందుకు అహరహం శ్రమించి, విశేష కృషి సల్పి లక్ష్యసాధనలో సిద్ధి పొందారు. తిరిగి హందూ మతంలోకి రావాలనుకునే వారికి, కల్పవృక్షమై నిలిచారాయన. 1331లో ప్రజోత్పత్తి సంవత్సర కార్తిక శుద్ధ సప్తమి నాడు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. తమకు ముందున్న శృంగేరి పీఠాధిపతులు, విద్యా తీర్థుల అనుమతితో శృంగేరి పీఠానికి అనుబంధంగా విరూపాక్ష, పుష్పగిరి, శివగంగ, ఆమని సంకేశ్వర్‌, కొల్లాపురంలలో స్థాపనలు గావించి, అన్య మతాల బాధితులకు ఆశ్రయ దాత అయినారు. ”పరాశర మాధవీయం” అనే స్మృతి గ్రంథంలో తమ గూర్చి చెప్పుకున్నారు. శ్రీమతి మాయణునిల తనయుడై, సాయన, సోమనాథుడు ఇరువురు సోదరులు, సింగల అనే సోదరిని కలిగి, కృష్ణ యజుర్వేది, బోధాయన సూత్రుడు, భారద్వాజ గోత్రుడు, మాధవ జన్మనామం కలిగి, సన్యాసి నుంచి ”విద్యారణ్య” నామధేయులైన స్వామి, బాల్యమున విద్యాభ్యాసం నాటికి దక్షిణ భారతంలో ఆర్ష పరిస్థితి శోచనీయమై, వేదశాస్త్రాలు అడుగంటి, శ్రౌతస్మార్త విద్యలు భ్రష్ట మై, ఉపనిషన్మతం పెడత్రోవలో పడి, మతం పలు శాఖలుగా చీలిన పరిస్థితులలో, విద్యారణ్యుడు అవతరించి వేద మతాన్ని ఉద్ధరించారు. మత త్రయాచార్యులు, వేదాంత శాస్త్రాలను మాత్రమే విస్తరింప చేయగా, వేదార్థ విశదీకరణ కానరాని స్థితిలో, గాయత్రీ మంత్రోపాసకుడై, భువనేశ్వరి మాత ప్రత్యక్ష ప్రసన్నతో, హరి హర బుక్కరాయలచే రాజ్యస్థాపన గావించి, కొంత కాలము మంత్రిగా ఉండి, 1400 గ్రంథాలు రచించి 1380లో శృంగేరి పీఠాధిపతులై లౌకిక, వైదికాంశములలో, అసమాన ప్రతిభులై, మత, రాజ్యోద్ధరణ గావించినట్లు, చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. సర్వజ్ఞ విష్ణు అనే గురువు వద్ద వేదాంత శాస్త్రాలు ఆయన అభ్యసించినట్లు సర్వదర్శన సంగ్రహంలో ఉంది. బ్రహ్మచర్యాశ్రమం నుండి మాధవుడు సన్యసించినట్లు చెబుతారు కానీ చాళుక్య చక్రవర్తి మంత్రి అయిన వీతి హూత్రుని కుమార్తె వీతి హూత్రి అను కన్యను తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం పెండ్లి చేసుకుని కొంతకాలం సంసారంలో ఉన్నా, బ్రహ్మచర్య నిష్ఠా గరిష్టుడు అగుటచే యవ్వన వంతులుగా ప్రకాశించినట్లు పురాణపండ రామ్మూర్తి పేర్కొన్నారు. అన్యమతస్తుల ఆగడాలు కలత పెట్టగా, మాధవుడు తుంగభద్ర తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి గాయత్రి మంత్రంతో తీవ్ర తపస్సు ప్రారంభించగా అమ్మవారు ప్రత్యక్షమైన వేళ,ఆయన ఐశ్వర్యం కావాలని కోరారు. అందుకు ఆయనకు అర్హత లేదని, అమ్మ వారు చెప్పిన ప్రకారం సన్యసించి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహంచగా, అప్పుడు, ఆ జగజ్జనని మూడు గడియల సేపు సువర్ణ వృష్టి కురిపించినట్లు కథనాలు. భువనేశ్వరి మాత అనుగ్ర హంచిన అపార సంపత్తిని విరూపాక్ష పీఠం నెలకొల్పడానికి, విద్యా నగరాన్ని పెంపొందించడానికి, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఉపయోగించారు.
ధర్మపురితో విద్యారణ్యుల అనుబంధం
విజయనగర సామ్రాజ్య రాజధాని విజయనగరాన్ని నిర్మించి, శృంగేరి పీఠం అధిష్టించిన పవిత్రాత్ములకు, ధర్మపురి క్షేత్రంతో విడదీయాలని సంబంధం, అనుబంధం ఉన్నాయి. ప్రాచీన ఆర్ష విద్యా, సంస్కృతులకు కేంద్ర స్థానం అయి, వేద విద్య కు కాణాచియై, చరిత్రకందనంత పూర్వ కాలికంగా, ఉజ్వల సాం స్కృతిక వైదిక పౌరాణిక పుణ్యస్థలమై, పవిత్ర గోదావరి తీర క్షేత్ర మైన ధర్మపురితో, ఆయనకు అత్యంత సాన్ని హత్యం ఉంది. ఈ నేప థ్యంలోనే శాలివాహన శకం 1258 (క్రీస్తుశకం 1336) ధాత్రు నామ సంవత్సర వైశాఖ శుక్లపక్ష సప్తమి పుష్యమి నక్షత్ర సింహ లగ్నం సుముహూర్తాన, ”విజయనగర సామ్రాజ్య స్థాపన” సమయాన ధర్మపురికి చెందిన, చతుర్వేద పండితులను, ఆహ్వానించినట్లు చెప్పబడుతున్నది పింగళి సూరన ”కళా పూర్ణోదయం”లో చతు ర్వేదాలు, బ్రాహ్మణ కుమారులుగా, ధర్మపురిలో జన్మించినట్లు గాధ నిర్మించారు. చతుర్వేదాలు ప్రభవించడానికి, యోగ్యమైన క్షేత్రంగా ధర్మపురి సూరన భావించాడు. అంతేగాక ధర్మపురికి, విజ యనగర రాజ్యానికి, దగ్గర సంబంధం ఉన్నట్లు, చారిత్రక పరిశోధ కులు, బహు గ్రంథ కర్త, డాక్టర్‌ సంగనభట్ల నరసయ్య ఈ విష యంలో విశేష కృషి సలిపారు. ధర్మపురిలోని యోగ నరసింహుడు విజ యనగరంలోనూ ఆరాధ నీయుడైనాడు. ధర్మపురి లోని 60 స్తంభాల గుడిని పోలిన వంద స్తంభాల విఠలాలయం హంపిలో ఉంది. హంపీలోని తుంగభద్ర నదిలో కోదండ రామాలయానికి ఎదు రుగా ఉన్న చక్రతీర్థం, గోదావరిలోని చక్రతీర్థంను పోలి ఉంది. ధర్మపురి లాంటి కళ్యాణ డోలోత్సవ మంటపాలు, విఠ లేశ్వర మందిరంలోనూ ఉన్నాయి. కృష్ణ దేవరాయల సోదరుడు వీర నరసింహ రాయలు ఉదయమే, నూటొక్క దివ్య క్షేత్రాల ప్రసా దం తీసుకోనిదే, రాయ సింహాసనం అధిరోహంచే వారు కాదట. అలా నూటొక్క దివ్య తిరుపతిలలో ఒకటిగా, నవనారసిం#హ క్షేత్రా లలో ఉత్కృష్టమైనదిగా ధర్మపురి ప్రసిద్ధమైనది. ధర్మపురి క్షేత్రంలో వీధి వీధికి శివలింగం, నంది, పార్వతి, గణపతి, ఆంజనేయులుతో కూడిన ”శివ పంచాయతనాలు” అనబడే గ్రామ రక్షక దేవతల గద్దెలు ఉన్నాయి. ఇలాంటివే శృంగేరిలోనూ ఉన్న నేపథ్యంలో, ధర్మపురి ప్రాంత ప్రభావితుడైన విద్యారణ్యుల ద్వారానే ఈ సాం ప్రదాయం ప్రబలినట్లు చెబుతారు. దక్షిణామ్నాయ శృంగేరి పీఠం 12వ అధిపతి అయిన విద్యారణ్యులు, ధర్మపురిలో నివసించి, వేదా ధ్యయనం చేసినట్లు, విజయనగర రాజ్య స్థాపకుడు హక్క, బుక్క సోదరులలో జ్యేష్ఠుని పట్టాభిషిక్తుడిని చేసి ”హరి హర రాయలు” అని నామమిడినట్లు, ఇది హరి హర క్షేత్ర మైన ధర్మపురి ప్రభావ ఫలి తమేనని, హరి హర అభేదమైన నరసిం#హునికి, శివునికి సమాన పూజలు, అనాదిగా జరుగుతూ, బ్రహ్మ, శివ అంశలతో జన్మించిన ఆంజనేయుని, గణపతి విగ్రహాలు నరసింహ ఆలయంలో కలిగి, శివకేశవ అభేద తత్వాన్ని చాటుతూ, స్మార్త ఆగమ పూజ రీతులతో, శైవ వైష్ణవ ఆగమ విధానాలతో, ఆచరించే సత్సంప్రదాయం, విద్యా రణ్యుల పై తీవ్ర ప్రభావం చూపి నట్లు, అది యావత్‌ భారతానికి ఆ దర్శ ప్రాయమైనట్లు భావించడా నికి ఆధారాలు ఊతమిస్తు న్నా యి. జాతిని ఉత్తేజపరిచిన మ#హనీ యులలో అగ్రశ్రేణికి చెందిన విద్యా రణ్యులను ఏడాదికి ఒక నాడైనా ఆరాధించడం, మన కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement