Monday, November 25, 2024

వేంకటేశ్వర గోశాలకు ఆవులు, దూడలు కానుక

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలోని శ్రీవేంకటేశ్వర గోశాలకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మెన్‌ శివకుమార్‌ సుందరన్‌ కాంక్రీజ్‌ జాతికి చెందిన రెండు ఆవులు, రెండు దూడలను శుక్రవారం కానుకగా సమర్పించారు. ఆ పత్రిక ప్రతినిధి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేతులమీదుగా ఆవులను గోశాలకు అందించారు. వైవీ సుబ్బారెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకు న్నారు. అనంతరం శివకుమార్‌ సుందరన్‌ గోశాలను పరిశీలిం చారు. శ్రీవారి నవనీత సేవ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తిరుమలలో వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్య క్రమం ని ర్విగ్నంగా కొనసాగించడానికి తిరుమలలోని గోశాలను విస్తరించడం జరుగుతుందన్నారు. ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామ న్నారు. ఇక్కడ 60 దేశీయ జాతి ఆవులు ఉన్నాయని, మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చారని చెప్పారు.
కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం వల్లే టికెట్ల సంఖ్య పెంపు
కోవిడ్‌ తగ్గుముఖం పట్టినందువల్ల నవంబర్‌, డిసెంబర్‌ నెలల కు సంబంధించిన రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టికెట్ల సంఖ్య గత నెల కంటే పెంచామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన గంటన్నరలోనే బుక్‌ చేసుకున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement