Wednesday, September 18, 2024

విష్ణు గణాధిపతివిక్ష్వక్సేనుడు!

యస్య ద్విరద వక్షాద్యా: పారిషద్యా: పరశృతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
తాత్పర్యం: ఎవరైతే గజముఖుడైన, (విష్ణు సైన్యాధిపతి యైన విక్ష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన సదా వారిని రక్షి స్తూంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్విఘ్నంగా ఎదుర్కొ నే శక్తిని ప్రసాదిస్తారు.
శైవ సంప్రదాయంలో గణపతిని విఘ్నాధిపతిగా, గణ నాయకుడిగా తలుచుకున్నట్లుగానే, వైష్ణవులు తొలిగా విక్ష్వక్సే నుని స్మరిస్తారు, పూజిస్తారు. వినాయకుడు శివగణాధిపతి కాగా, విక్ష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. వైకుంఠసేనాని. రూపంలోనూ వినాయకుడికి, విక్ష్వక్సేనుడికి పోలికలుంటా యి. ఇద్దరూ గజ ముఖులే. కాకపోతే విఘ్నేశ్వరుడు ఏకదంతు డు, విక్ష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ గజముఖుడైన విక్ష్వ క్సేనుడికి తొలి పూజచేస్తే, ఆ కార్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురై నా జయం నిశ్చయం అంటారు. ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూ పుడే అంటాయి శృతులు. చతుర్భుజాలలో కుడి చేతిలో అభ యముద్రనిస్తూ, పర #హస్తములలో శంఖు, చక్రాలను ధరించి దర్శనమిస్తాడు. వైష్ణవులు స్మరించే గురు పరంపరలో మొదటి స్థానం విష్ణుమూర్తి, రెండవస్థానం లక్ష్మీదేవిలది కాగా ఈయ న మూడవ స్థానంలో నిలుస్తారు.
పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉం టున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకు న్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండి పోవాల్సి వస్తోందని, ఇంతవరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అస లు వైకుంఠం లోపల ఎలా ఉంటుం దో తమకు తెలియదని, అదే సమ యంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి, అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అన్నారు. అనం తరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు, ఆయనతో ద్వార పాలకులు చెప్పిన విషయాలను ప్ర స్తావించాడు. అతని మాటలను విని సంతోషపడిన నారదుడు తాను వైం కుఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ, ఎటు వంటి అడ్డంకులు లేకుండా వైకుంఠం లో సంచరించగలిగేది విక్ష్వక్సేనుడేనని, ఆ అదృష్టం తనకు దక్కలేదని చెప్తాడు.
ఆ మరుక్షణమే భక్తుడు, విక్ష్వక్సేనుని ముందు కెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగడుతాడు. అది విన్న విక్ష్వక్సేనుడు, తనకంటే గరుత్మంతునిదే అదృష్టమని అనగా, ఆ గరుత్మంతుడు, తనకంటే స్వా మి పాదాలను ఒత్తుతూ, తరిస్తు న్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటారు. మరి, ఆ లక్ష్మీదేవేమో, తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెబుతుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నం త సేవను తాను చేయలేకపోతున్నానని అంటుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయ అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, ”మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడి వి. మేమందరం ఆయనకై పరుగులు పెడుతోంటే, ఆ పరంధా ముడు మీ వంటి భక్తులకై పరుగులు పెడుతున్నాడు. అదృష్ట మంటే మీదేగా!’ అని అన్నాడు. ఇదిలా వుండగా, ఒకసారి రాక్ష సులు పెట్టే బాధలను ఓర్చు కోలేకపోయిన దేవతలు, వైకుంఠా నికి వచ్చి, తమను రాక్షసుల బారి నుండి కాపాడాలని నారాయ ణుని ప్రార్థించారు. విష్ణుమూర్తి చంద్ర అనే వానిని పిలిచి, రాక్ష సుల పని పట్టమని చెప్పాడు. స్వామి ఆనతితో ఆ రాక్షసులను తరిమి కొట్టిన చంద్ర శౌర్యప్రతాపాలను మెచ్చుకున్న నారాయ ణుడు, అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విక్ష్వ క్సేనుడు. శ్రీమహావిష్ణు రూపమే విక్ష్వక్సేనుడని అంటారు.
విక్ష్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్ష త్రంలో ఆవిర్భవించారు. బంగారు శరీర వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దే#హంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నా లతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతారు. ఈయనను క్యసమ#హర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తారు. వృ షభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్ర#హంతో సేనాపతిగా అవతరిస్తారు. తిరుమలలో స్వామి వారి ఆలయానికి ఈశాన్యభాగంలో విక్ష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కో టి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకా దశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరుస్తారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్స వాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. రాజు వచ్చే ముందర సేనాధిపతి భద్రతా పర్యవేక్షణ చేస్తారన్న మా ట. నాలుగు మాడ వీధులలో విక్ష్వక్సేనుల వారి ఊరేగింపు అయ్యాకే, వెంకటేశ్వరస్వామి వారు వా#హనంపై వేంచేస్తారు.
విష్ణు స్వరూపానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువు కు శ్రీవత్సం, బ్ర#హ్మ సూత్రం ఉంటాయి. విక్ష్వక్సేనుడికి అవి ఉండవు. ‘విశ్వ’ అంటే సకల లోకాలను, ‘సీనుడు’ అంటే నడి పించేవాడని అర్ధం. శ్రీవైఖానసాగమంలో విక్ష్వక్సేనునికి ప్రతి కార్యంలో అగ్రతాంబూలమిచ్చి తొలి ఆరాధనలు చేయడం జరుగుతుంది. శైవంలో పసుపు గణపతిని పసుపు పూజిస్తే, వైష్ణవంలో తమలపాకుపై వక్కను ఉంచి, విక్ష్వక్సేనునిగా భావి స్తారు. అందుకే వక్కలు లేని ఆకులు నిరర్ధకం, నిష్ఫలం అంటా రు. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను #హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement