ఈ సువిశాల విశ్వం అంత పర మేశ్వరుని ద్వారానే ఏర్పడింది. ఈ విశ్వానికి ఆది, అంతం ఆ భగవం తుడు. ఆ భగవంతుని తత్ స్వరూ పమే మనం గాంచేది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు వివిధ అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. వివిధ రూపాలలో భగవంతుడు ఉంటాడు. మనం ఆరాధించే హిందూ దేవతలు అందరూ రకరకాలుగా ఉంటారు, అనేక హస్తాలతో దర్శన మిస్తుంటారు. నాలుగు, ఆరు, ఎనిమిది, పన్నెండు, వంద, సహస్రం ఇలా విశేషంగా హస్తాలతో దర్శనం ఇస్తున్న రూపాలు కోకొల్లలు. సాధారణ మానవుడు రెండు చేతులతో చేయగలిగే పనికంటే దేవతలు ఎక్కువ పనిని ఎక్కువ సామర్ధ్యంతో అతి స్వల్ప కాలంలో చేయగలుగు తారు. అందుకే వారికి అన్ని హస్తాలు అని కొందరు అవహేళన చేయడం, వ్యంగ్యం గా మాట్లాడటం చూస్తున్నదే. ఏది ఏమైనా మనం ఒక విషయాన్ని గుర్తుం చుకోవాలి. ఈ సకల విశ్వమే పరమేశ్వర స్వరూపం. కనుక ఈ విశ్వం లోని దేవుళ్ళందరు పనిచేయుటకు కావాల్సిన సామర్ధ్యాలు పరమేశ్వర చేతుల నుండే వస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి చూపిన విశ్వ రూపంలో పరమాత్మ లెక్కలేనన్ని హస్తాలతో కనపడతాడు. ఆ హస్తాలతో ఒక్కొక్క హస్తం ఒక్కో ఆయుధాన్ని పట్టు-కుని ఉంటు-ంది. ఈ ఆయుధాలు గొప్ప విశిష్టత కలిగి ఉన్నాయి. శంఖారావం జీవునికి భగవంతుని యొక్క ధార్మిక శక్తిని చూపుతుంది. గద దండించే సామర్ధ్యం తెలుపుతుంది. కరవాలం చేతి యొక్క పనితీరును తెలుపుతుంది. చక్రం రాక్షస సంహారం తెలుపుతుంది. ఇలా ఒక్కొక్క హస్తం ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటు-ంది. ఇంతటి ఉగ్రరూపాన్ని చూసిన అర్జునుడు శ్రీకృష్ణుని శాంతి రూపం చూడాలి అనుకున్నాడు. ఆ నిమిషంలోనే అర్జునుడు శ్రీ కృష్ణుని వేడు కుంటే శాంతించి యధారూపం ధరిస్తాడు. ఈ విశ్వం అంతా నేనే, నేనే త్రికాల స్వరూపం, నేనే విశ్వం యొక్క పరమేశ్వర స్వరూపం అని బోధించాడు.
– కనుమ ఎల్లారెడ్డి
93915 23027
విశ్వం పరమేశ్వర స్వరూపం
Advertisement
తాజా వార్తలు
Advertisement