Tuesday, November 26, 2024

విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు గురు వారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహాగణపతి పూజతో నవరాత్రి వేడుక లకు అంకురార్పణ చేశారు. అంతకుముందు పీఠాధి పతులు గోపూజ నిర్వహించి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో విశేష అభిషే కాన్ని నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర స్వామి చేతులమీదుగా పంచామృతా భిషేకం నిర్వహిం చారు. అభిషేక సమయంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చా రు. పీఠం ప్రాంగణంలోని యాగ శాలలో చండీ హోమాన్ని చేపట్టారు. లోక కళ్యా ణాన్ని కాంక్షిస్తూ నవరాత్రుల్లో విశాఖ శ్రీ శారదా పీఠం ఈ యాగాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్ధిస్తూ శ్రీమత్‌ దేవీ భాగవత పారాయణ ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీమత్‌ దేవీ భాగవత పారాయణ వింటే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పీఠార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకొని సేవించుకున్నారు. పీఠాధిపతుల ఆశీర్వాదం పొందారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పీఠం వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement