Saturday, November 23, 2024

విశాఖ శారదాపీఠంలో చండీయాగం

మహేశ్వరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు
విశాఖపట్నం, ప్రభ న్యూస్‌భ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు శుక్రవారం మహేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టు-కుంది. మహేశ్వరి అమ్మవారికి పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి హారతులిచ్చి పూజలు చేసారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్ధం విశాఖ శ్రీ శారదాపీఠం శత చండీ యాగాన్ని చేపట్టింది. 15 మంది రుత్విక్‌లు ఈ యాగంలో భాగస్వామ్యులయ్యా రు. చండికా దేవి విశిష్టతను స్తుతిస్తూ 13 అధ్యాయాలను పారాయణ చేస్తున్నారు. మహా కాళికాదేవి, మహాలక్ష్మి, మహా సరస్వతి విశిష్టతను సంస్కృతంలో పారాయణ చేస్తున్నారు. చండీయాగంలో 13 రకాల సుగంధద్రవ్యాలతో హోమా లను నిర్వహిస్తున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చండీయాగం శాస్త్రోక్తంగా సాగుతోంది. యాగంలో భాగస్వామ్యులైన పండితులకు పీఠాధిపతులు దీక్షా వస్త్రాలను అందించి దీక్షాధారణ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement