నువ్వు ఇతరులకు అందించే సహాయం వెనుక ఉన్న శక్తి నీలోనిది కాదు, ఆ శక్తి ప్రేమది అని తెలుసుకుంటే నీలో నమ్రత వస్తుంది. నువ్వు నమ్రతతో ఉంటే అందరూ నీ తల మీద ఎక్కి కూర్చుంటారు అన్నది నిజం కాదు. నమ్రత లేనప్పుడు నువ్వు ఇతరులకు త్వరగా ప్రభావితమైన అన్నీ కష్టంగా కనిపిస్తాయి. కానీ, నమ్రత ఉంటే సత్యత శక్తి కూడా ఉంటుంది. ఇతరులు ఏమన్నా, ఏమనుకున్నా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావని నీకు తెలుసు. నమ్రత కలిగిన వ్యక్తి ఎప్పుడూ కూడా తాను ఎదుటివారి ముందు తల వంచుతున్నాను అని భావించడు. అతని తలపైకి, లేక కిందకు ఉండదు. అతని తల ఒక దేవతవలె నేరుగా ఉంటుంది. నమ్రత నీలోని సత్యతను చూపిస్తుంది.
నీలోని అహం ఇతరులను విమర్శించేలా చేసి నిన్ను ఒక సాలెగూడులో బంధిస్తుంది. అహం బుద్ధికి తాళం వేసి నీ బాధ్యతను మరుగున పడవేస్తుంది. ” అది నీ తప్పు, నాకు సంబంధం లేదు”, అని నీ అహం నిన్ను చివరకు మోసగిస్తుంది. ఇందుకు తాళం చెవి వినమ్రత. అది నిన్ను ఆత్మ వంచన నుండి రక్షిస్తుంది. నీ అంతరాత్మ చెప్పేది వినడానికి, సమ్మతించడానికి వినమ్రత సహకరిస్తుంది. వినమ్రతతో అవగహన పెంచి, పరివర్తనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఒక్క క్షణంలో ఆత్మ తన తప్పును తెలుసుకుంటుంది? ” అవును, నాదే పొరపాటు….” అంటూ ఎటువంటి వాదననైనా సునాయాసంగా ముగిస్తుంది.
నమ్రత హృదయాన్ని నిజాయితీగా, విశాలంగా, స్వచ్ఛంగా చేస్తుంది. అందరితో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి అది సహకరిస్తుంది. వినమ్రత వలన నువ్వు భగవంతుని హృదయాన్ని జయించగలవు. ఇతరుల హృదయాలను, నీ హృదయాన్ని కూడా జయించగలవు. నీలోని భావాలను నీకు జరిగే అంతర్‌ఘర్షణ సమాప్తమవుతుంది. కనుక గందరగోళం, కష్టాలు ఉండవు, అందరి పట్ల సంతృప్తి, విశ్వాసము, ప్రేమ భావాలు ఉంటాయి.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి