సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు పంపా తీరానికి పడమటి దిక్కున వున్న శబరి (మతంగ మహాముని) ఆశ్రమానికి చేరుకోగానే, ఆమె వీరికి పాద నమస్కా రం చేసి, శాస్త్ర ప్రకారం ఉపచారాలు చేసింది. సంతోషించిన శ్రీరామచంద్రుడు శబరి ని ‘సాధుచరిత్రా, కోపంలోను, ఆహారంలోను, నిర్మలమైన మనసు కలదానా’ అని సంబోధి స్తూ, అలాంటి నియమం కల శబరి, ఆమె చేస్తున్న తపస్సులు, వ్రతాలు, నిర్విఘ్నంగా సాగు తున్నాయా అని, మనసు ఎల్లప్పుడూ ప్రసన్నంగా, శాంతంగా వున్నది కదా అని, గురు సేవ లు కొనసాగుతున్నాయా అని, అలా చేయడం వలన ఫలితం వున్నదా అని ప్రశ్నించాడు.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యధాతథంగా తెలుగులోకి అనువదించిన, ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసస్వామి) గారు, శ్రీరాముడు శబరికి వేసిన ప్రశ్నలో ఇమిడివున్న అద్భుతమైన ధర్మార్థాన్ని వ్యాఖ్యానంగా, అరణ్యకాండ మందరంలో వివరించారు. ‘నిర్విఘ్నంగా సాగుతున్నాయా’ అనే దానికి వివరణ ఇస్తూ, ‘కామ, క్రోధ, లోభాలు’ అనే మూడు ‘నిర్విఘ్నాలు’ తపస్సు నాశము చేయడమే కాకుండా నరక ద్వారాల వుతాయని, ఉదాహరణగా, విశ్వామిత్రుడు లాంటివారు కామం, ఆగ్రహం మూలాన తప స్సు నాశము చేసుకున్న విషయం ప్రస్తావించారు.
ఇక శ్రీరాముడు సంబోధించిన ‘ఆహారం’ విషయానికి వస్తే, నిషిద్ధ వస్తువులను తినకుం డా వుండడం, నిషిద్ధ కాలాలలో తినకుండా వుండడం, మితభుక్తి, సాత్త్విక పదార్ధాలను తిన డం అనే అర్థం ప్రధానంగా స్ఫురిస్తుంది. సహపంక్తిలో తింటున్నవారితో అనవసర ప్రసం గం చేయకూడదు. నోటి నుండి జారిపడినదానిని, భుజించగా మిగిలిన పదార్థాలను, మళ్లి తినకూడదు. పిండి వంటకాలను, కూరలను, దుంపలను, ఫలాలను, చేయితో విరిచి తినాలి కాని, పంటితో కొరికి తినకూడదు. విస్తరి (ప్లేట్)లో ఉప్పు ప్రత్యేకంగా వేయకూడదు. పెరు గు, లేదా, చల్లలో కలిపే వేయాలి. నూనెతో వండినవి కాని, పచ్చివికాని, గరిటెలతో వేయ కూడదు. అన్నం, కూరలు, పచ్చళ్లు, మంచినీరు, పెరుగు, పాలు, నేయి, చేతితో వేయకూడ దు. గరిటెలు (లేదా ఆకులు) ఉపయోగించాలి. తినే అన్నం విషయంలో కాని, కూరలు, పచ్చళ్ల విషయంలో కాని తినేటప్పుడు తప్పులు ఎంచకూడదు.
దేవాలయాలలో, చీకట్లో, ఆరు బయట, మిద్దెల మీద, వట్టి నేలమీద, పాడుపడ్డ ఇంటి లో భోజనం చేయకూడదు. పగలు కాని, రాత్రికాని రెండుసార్లు తినకూడదు. రాత్రి రెండు జాములు దాటిన తరువాత, అర్థరాత్రి, పగలు రెండు జాముల వేళ తిన కూడదు. నిలుచుని, కుర్చీమీద కూచుని, ఆచమనం చేయకుండ, ఒంటి వస్త్రంతో, తలగుడ్డతో తినడం నిషిద్ధం. ఇతరులు తాకినదాన్ని, చేతిలో పెట్టుకుని కాని, విడి ఆకులో కాని, మట్టి పాత్రలో కాని, వస్త్రం మీద కాని తినడం తప్పు. ఒక పంక్తిలో తింటూ తాను ముందుగా లేచి వెళ్లకూడదు. తప్పక వెళ్లాల్సిన అవసరం కలిగితే కొన్ని నియమాలు పాటించాలి. చెడు శబ్దాలు వింటూ భోజనం చేయడం తప్పు. భోజన సమయంలో భార్య మీద, పిల్లల మీద కోప్పడడం, వారికి ఎంగిలి పదార్థాలు పెట్టడం పనికిరాదు. పాయసం, పెరుగు, పాలు, నీరు, నేయి శబ్దం కాకుండా తాగాలి. సశేషంగా తీసుకోవాలి. రాత్రి తినేటప్పుడు దీపం ఆరిపోతే (విద్యుత్ పోతే!) సూర్యు డిని స్మరించుకుని, చేతులతో పాత్రను తాకి వుండి, తిరిగి దీపం వచ్చేదాకా తినకూడదు. అప్పుడైనా పాత్రలో వున్న పదార్ధాన్నే తినాలి. ఈ నియమ నిబంధనలతో పాటు, మరికొన్ని నిషిద్ధాలను కూడా శబరి వృత్తంలో చర్చకు వచ్చాయి. ఇక శ్రీరాముడు అడిగిన గురు పూజ, గురు సేవలు కొనసాగుతున్నాయా అన్న ప్రశ్న విష యంలో కూడా అద్భుతమైన వ్యాఖ్యా నం వున్నది. గురువు, గురుపుత్రులు లేనప్పుడు గురు శుశ్రూష ఏమిటని సందే#హం కలగ వచ్చు. గురువు లేకపోయినా ఆయన పాదుకలు వుంచు కుని గురుపూజ చేయాలి. గురుభక్తి లేని వారికి ఆయన చెప్పిన విషయాలు మనస్సుకు రావు. అలాంటప్పుడు ‘ఫలానుభవం’ వుండదు. అందుకే శ్రీరాముడు శబరిని ‘గురుపూజాఫలం’ వున్నదా? అని ప్రశ్నించాడు. మనస్సు, వాక్కు, కాయము, పరిశుద్ధంగా వుంచుకుని, గురుభ క్తి, దైవభక్తి కలిగి ఉన్నవారిని భగవంతుడు స్వయంగా వెతుక్కుంటూ వస్తాడని శబరీరామ చరిత తెలియచెప్తున్నది. భగవదాపేక్ష వుండికూడా శ్రీరాముడిని వెతుక్కుంటూ పోయే శక్తిలేని శబరి దగ్గరికి, భగవంతుడైన రాముడే రావడం దీనికి నిదర్శనం.
ఆ విషయాన్నే శబరి నోట చెప్పిస్తాడు వాల్మీకి. తన గురు శుశ్రూషకు ఫలం భగవత్సాక్షా త్కారమని, అది రాముడిని చూడడంతోనే కలిగిందని, తన గురుశుశ్రూష ఫలించిందని, తన తపస్సుకు, వ్రతాలకు ఫలం కూడా భగవత్సాక్షాత్కారమేనని, అదికూడా రాముడి దర్శ నంతో జరిగిందని, తాను సార్థకజన్మురాలిని అయ్యానని, తనకిక మోక్షప్రాప్తి కలుగుతుంద ని, పాపాలు, అరిషడ్వర్గాలు హతమయ్యాయని అంటుంది శబరి. ఇలా అంటూ, తాను సంతోషంతో ఏరి కోరి కోసి వుంచిన (రుచి చూసిన లేదా ఎంగిలి చూసిన అనలేదు వాల్మీకి రామాయణంలో) నానా రకాల కందమూల ఫలాలు రాముడికి తినడానికి ఇచ్చింది. ఇక్కడ (ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి వ్యాఖ్యానం ఆధారంగా) శబరిలోని సహజ స్త్రీత్వం వ్యక్త మైంది. శరభంగాది పురుష ఋషులు రాముడి రాకను ముందుగా తెలిసినవారే. ఆయన వచ్చిన సమయంలో ఆశ్రమంలో వున్న పండో, కాయో సమర్పించినవారే. శబరి మాత్రం ముందుగా ఏర్పాటుచేసుకుని తెచ్చి పెట్టుకున్నది. అతిథి ఆకలి దప్పులు విచారించడం ఉత్త మ స్త్రీల లక్షణం, సహజ గుణం. శబరి మాటలకు స్పందనగా రామచంద్రమూర్తి ఆమె గురు వుల ప్రభావంవిన్నానని, అది ప్రత్యక్షంగా చూడాలని కోరికగావుందని, ఆచిత్రాలను చూపిం చమని ఆమెను కోరాడు. బదులుగా శబరి, వర్షించే మేఘాలలాగా నల్లగా వ్యాపించి, మృగా లతో, పక్షులతో నిండి వున్న మతంగ వన స్థలంలో తమ మంత్రాల శక్తితో ఆమె గురువులు తీర్థాలను కల్పించారని, పడమటి వేదిమీద తమ స్వాములు ముసలితనంతో వణకుతున్న ప్పటికీ భగవదారాధన మానకుండా పూలతో పూజించేవారని, వారి తపోమహమ వల్ల వేదు లు వాళ్లు లేకున్నా దిక్కులన్నిటినీ ప్రకాశింప చేస్తున్నాయని, శుష్కోపవాసాలు చేసి బల#హ నంగా వుంటే వాళ్ల పిలుపు మేరకు సముద్రాలే వారి దగ్గరికి వచ్చాయని, గురువులు స్నానా లు చేసి తడిసిన నారవస్త్రాలు అక్కడి చెట్లకొమ్మల మీద వుంచి పోయారని…
వాల్మీకి శబరీ రామచరితలో…సనాతన ధర్మం
Advertisement
తాజా వార్తలు
Advertisement